అయ్య‌ప్ప భ‌క్తుల కోసం ప్ర‌త్యేక రైళ్లు న‌డ‌ప‌నున్న భార‌తీయ రైల్వే.. వివ‌రాలివే..!

-

శ‌బ‌రిమల వెళ్లాల‌నుకునే భ‌క్తులకు భార‌తీయ రైల్వే శుభ‌వార్త చెప్పింది. ప్ర‌యాణికుల కోసం ప‌లు ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డ‌ప‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

శ‌బ‌రిమల వెళ్లాల‌నుకునే భ‌క్తులకు భార‌తీయ రైల్వే శుభ‌వార్త చెప్పింది. ప్ర‌యాణికుల కోసం ప‌లు ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డ‌ప‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ క్ర‌మంలో ద‌క్షిణ మ‌ధ్య రైల్వే డిసెంబ‌ర్ 6 నుంచి జ‌న‌వ‌రి 18వ తేదీ వ‌ర‌కు 12 ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డుపుతున్న‌ట్లు తెలిపింది. కాగా ఈ రైళ్ల‌కు గాను ఇప్ప‌టికే ముందుస్తు రిజ‌ర్వేష‌న్ల‌ను కూడా ప్రారంభించారు.

indian railways to arrange special trains for ayyappa pilgrims

డిసెంబ‌ర్ 11, 15, 19 తేదీల్లో హైద‌రాబాద్ నుంచి, డిసెంబ‌ర్ 6, 13, 22 తేదీల్లో నిజామాబాద్ నుంచి శ‌బ‌రిమ‌ల‌కు ప్ర‌త్యేక రైళ్లు న‌డ‌వ‌నున్నాయి. ఈ క్ర‌మంలో హైద‌రాబాద్ నుంచి బ‌య‌ల్దేరే రైళ్లు మ‌ధ్యాహ్నం 3.55 గంట‌ల‌కు ప్రారంభ‌మై మ‌రుస‌టి రోజు రాత్రి 11.55 గంట‌ల‌కు కొల్లాంకు చేరుకుంటాయి. అవే రైళ్లు తిరుగు ప్ర‌యాణంలో డిసెంబ‌ర్ 8, 15, 21, 24 తేదీల్లో మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు కొల్లాంలో బ‌య‌ల్దేరి మ‌రుస‌టి రోజు రాత్రి 10.45 గంట‌ల‌కు హైద‌రాబాద్‌కు చేరుకుంటాయి.

అలాగే నిజామాబాద్ నుంచి రైళ్లు మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు బ‌య‌ల్దేరి మ‌రుస‌టి రోజు రాత్రి 11.55 గంట‌ల‌కు కొల్లాంకు చేరుకుంటాయి. డిసెంబ‌ర్ 13, 17 తేదీల్లో కొల్లాం నుంచి నిజామాబాద్‌కు ప్ర‌త్యేక రైలు న‌డ‌ప‌నున్నారు. కాకినాడ నుంచి కొల్లాంకు కూడా ప్ర‌త్యేక రైలును న‌డ‌ప‌నున్నారు.

సికింద్రాబాద్ నుంచి కొల్లాం వెళ్లే ప్ర‌త్యేక రైలు జనగాం, కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట్, ఈరోడ్, కోయంబత్తూర్, ఒట్టపాలెం, ఎర్నాకులం, కొట్టాయం, చెంగనూర్ స్టేషన్లలో ఆగ‌నుంది. అలాగే నిజామాబాద్ నుంచి కొల్లాం వెళ్లే రైలు కామారెడ్డి, మల్కాజ్‌గిరి, కాచిగూడ, మహబూబ్‌నగర్, కర్నూలు, గుత్తి, తాడిపత్రి, కడప, రేణిగుంట, కాట్పాడి, ఈరోడ్, కోయంబత్తూర్, కొట్టాయం, చెంగనూర్ స్టేషన్లలో ఆగ‌నుంది. అదేవిధంగా కాకినాడ‌ నుంచి సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ, నెల్లూరు, రేణిగుంట‌, తిరుత్తణి, సేలం, తిరుపూర్, పాలక్కాడ్, అలువా, కొట్టాయం, తిరువళ్ల స్టేష‌న్ల మీదుగా ప్ర‌త్యేక రైలు న‌డుస్తుంది.

విశాఖ‌ప‌ట్నం నుంచి కొల్లాంకు ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్ర‌త్యేక రైలును న‌డ‌ప‌నుంది. ఈ రైలు న‌వంబ‌ర్ 17 నుంచి జ‌న‌వ‌రి 21 మ‌ధ్య 10 ట్రిప్స్ వెళ్తుంది. వైజాగ్ నుంచి కొల్లాంకు న‌వంబ‌ర్ 17, 24, డిసెంబ‌ర్ 1, 8, 15, 22, 29, జ‌న‌వ‌రి 5, 12, 19 తేదీల్లో రైలు న‌డ‌వ‌నుంది. ప్ర‌తి ఆదివారం రాత్రి 11.50 గంట‌ల‌కు రైలు వైజాగ్‌లో బ‌య‌ల్దేరి మంగ‌ళ‌వారం ఉద‌యం 6.55 గంట‌ల‌కు కొల్లాంకు చేరుకుంటుంద‌ని రైల్వే అధికారులు తెలిపారు. అలాగే కొల్లాం నుంచి వైజాగ్‌కు న‌వంబ‌ర్ 19, 26, డిసెంబ‌ర్ 3, 10, 17, 24, 31, జ‌న‌వ‌రి 7, 14, 21 తేదీల్లో ప్ర‌త్యేక రైలును న‌డ‌ప‌నున్నారు. ఈ రైలు మంగ‌ళ‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు కొల్లాంలో బ‌య‌ల్దేరి వైజాగ్‌కు బుధ‌వారం సాయంత్రం 6.30 గంట‌ల‌కు వ‌స్తుంది. ఇక ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, తుని, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట‌, తిరుత్తణి, కాట్పాడి, వనియంబడి, జోల్లార్‌పెట్టై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూర్ జంక్షన్, పాల్ఘట్, ఒట్టపాలం, త్రిసూర్, అలువా, ఎర్నాకులం టౌన్, కొట్టాయం, చంగనసేరి, తిరువల్ల, చెంగనూర్, మావెల్కారా, కన్యాకులం రైల్వే స్టేషన్లలో ఆగుతుంద‌ని రైల్వే అధికారులు ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news