భారత్ లో కరోనా విజృంభిస్తున్నా రికవరీ రేటు మాత్రం చాలా వేగంగా పెరుగడం కాస్త సంతోషం కలిగించే విషయం అని చెబుతున్నారు. అన్ని రాష్ట్రాలు రికవరీ రేటుని వృద్ది చేస్తుండడంతో ఇండియా కరోన రేట్ కూడా భారీగా పెరుగుతోంది. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటన ప్రకారం దేశంలో గడచిన 24 గంటలలో 57,982 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలానే గడచిన 24 గంటలలో దేశంలో కరోనా వల్ల మొత్తం 941 మంది మృతి చెందారు.
ఇక గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 57,584గా ఉంది. ఇక గడచిన 24 గంటలలో నమోదయిన కేసులతో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 26,47,663కు చేరింది. ఇక ప్రస్తుతం దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 6,76,900 ఉన్నాయి. కరోనాకు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 19,19,842కు చేరింది. ఇక కరోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 50,921కు చేరింది, ఇక దేశంలో 72.51 శాతానికి రికవరీ రేటు చేరింది. దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసులు 25.57 శాతం ఉన్నాయి.