భారత షట్లర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత కిదాంబి శ్రీకాంత్ పెళ్లి పీటలెక్కబోతున్నాడు. ఇటీవల తనకు కాబోయే భార్య శ్రావ్యతో కలిసి ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. తాజాగా జూబ్లీహిల్స్‌లో గల రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లిన వీరిద్దరు పెళ్లికి రావాలని వెడ్డింగ్ కార్డును రేవంత్ రెడ్డికి అందజేశారు. ఇదిలాఉండగా, బ్యాడ్మింటన్ క్రీడలో ప్రపంచ మాజీ నంబర్ వన్ కిదాంబికి 2018లో దేశ నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ లభించింది.
2015లో అతనికి అర్జున అవార్డు సైతం దక్కింది. ఇక తనకు కాబోయే భార్య శ్రావ్య వర్మ టాలీవుడ్ స్టార్ ఫ్యాషన్ డిజైనర్.ఆమె దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు మేనకోడలు. పెళ్ళి రిలేటెడ్ విషయాలను శ్రావ్య తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. శ్రావ్య టాలీవుడ్లో పలువురు స్టార్ హీరోలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా సైతం పనిచేసింది. విజయ్ దేవరకొండ, అక్కినేని నాగార్జున, వైష్ణవ్ తేజ్, విక్రమ్ తదితర స్టార్ హీరోలకు పర్సనల్ స్టైలిస్ట్‌గా కూడా పనిచేసింది. కాగా,వీరి పెళ్లితేదీని ఎక్కడా రివీల్ చేయకపోవడం గమనార్హం.