భారత జట్టుకి నిరసన సెగ.. సంజూ ఫ్యాన్స్ తాండవం !

-

IND VS SA : టీమ్ ఇండియాకు బిగ్‌ షాక్‌ తగిలింది. రాబోయే టి20 వరల్డ్ కప్ కు ముందు భారత్-సౌతాఫ్రికా మధ్య మూడు టీ 20 ల సిరీస్ జరగనుంది. ఇప్పటికే ఆస్ట్రేలియాతో ముగిసిన మూడు టి20 ల సిరీస్ ను 2-1 తో గెలిచిన టీమిండియా, సౌత్ ఆఫ్రికా తో సమరానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే సౌత్ ఆఫ్రికా తో మూడు టీ 20 ల సిరిస్ కు సిద్ధమైన టీమ్ ఇండియాకు నిరసన సెగ తగిలింది.

ఆదివారం ఉప్పల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో గెలిచిన రోహిత్ సేన మూడు టి20 ల సిరీస్ ను 2-1తో కైవసం చేసుకుంది. ఈ విజయంతో ఆత్మవిశ్వాసాన్ని రెండింతలు చేసుకున్న టీమిండియా సోమవారం తిరువనంతపురం చేరింది. సెప్టెంబర్ 28 నుంచి సౌత్ ఆఫ్రికా తో ప్రారంభం కానున్న మూడు మ్యాచ్ ల సిరీస్ కోసం సన్నదమవుతోంది.

తిరువనంతపురం చేరిన టీమిండియాకు అభిమానుల నుంచి ఊహించని షాక్ తగిలింది. టి20 ప్రపంచ కప్ లో చోటు దక్కని సంజు శాంసన్ కు మద్దతుగా అతని అభిమానులు రచ్చ చేశారు. సంజుకు అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ నిరసనను తెలియజేశారు. ఎయిర్ పోర్టు నుంచి భారత ఆటగాళ్లు బయటకు రాగానే సంజు, సంజు అని బిగ్గరగా నినాదాలు చేశారు. కేరళకు చెందిన సంజు శాంసన్ కు రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఈ క్రమంలోనే సంజుకు అవకాశం ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version