భారత్ కు మరో అరుదైన ఘనత దక్కింది. భారత త్రివర్ణపతాకం న్యూయార్క్ లోని ప్రతిష్ఠాత్మక టైమ్ స్క్వేర్ లో రెపరెపలాడింది. 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా దాదాపు 200 మందికి పైగా ప్రవాస భారతీయులతో శనివారం ఉదయం ఈ కార్యక్రమాజం నిర్వహించగా.. న్యూయార్క్ లో కౌన్సిల్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఉన్న రణధీర్ జైస్వాల్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి, జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
Consul General unfurled the #flag at a ceremony organized by Federation of Indian Associations (FIA) at Times Square @TimesSquareNYC.
Happy Independence Day. 🇮🇳 #IndependenceDay #AatmaNirbharBharat #IndependenceDay2020 @FIANYNJCTorg pic.twitter.com/5BruynBHGl— India in New York (@IndiainNewYork) August 15, 2020
భారత జెండాను ఎగురవేసే అవకాశం రావడం ఎంతో గర్వకారణం అనిపించింది. ఇండియన్స్ న్యూయార్క్ లో చరిత్ర సృష్టిస్తున్నారని తెలియజేశారు. పైగాఆ టైమ్ స్క్వేర్ వంటి ఎంతో చరిత్ర ఉన్న ప్రాంతంలో భారత త్రివర్ణపతాకం రెపరెపలాడటం నిజంగా గర్వకారణం అని ఆయన పేర్కొన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో భౌతిక దూరాన్ని పాటిస్తూ, కార్యక్రమం నిర్వహించామని ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు అలోక్ కుమార్ వెల్లడించారు.