దక్షిణాఫ్రికాపై భారత మహిళల జట్టు ఘన విజయం.. సిరీస్ క్లీన్ స్వీప్

-

భారత మహిళల జట్టు అదరగొట్టింది. సౌతాఫ్రికాపై మూడో వన్డేలోనూ 6 వికెట్ల తేడాతో గెలిచి సిరీసు క్లీన్ స్వీప్ చేసింది. తొలుత సౌత్ ఆఫ్రికా 8 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన టీమ్ ఇండియా 40.4 ఓవర్లలోనే ఛేజ్ చేసింది. స్మృతి మంధాన 90, షఫాలీ వర్మ 25, ప్రియా పునియా 28, హర్మన్ ప్రీత్ 42, జెమీమా 19* రన్స్ చేశారు. దీప్తి శర్మ, అరుంధతీరెడ్డి చెరో 2 వికెట్లు, శ్రేయాంక, పూజా వస్త్రాకర్ చెరో వికెట్ తీశారు.

ఇదిలా ఉంటే… మూడో వన్డేలోనూ చెలరేగిన స్మృతి మంధాన 83 బంతుల్లో 90 రన్స్ చేసి ఔటయ్యారు. ఈ క్రమంలో భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక రన్స్ చేసిన వారి జాబితాలో రెండో స్థానానికి చేరారు. మిథాలీ రాజ్(7,805) అగ్ర స్థానంలో ఉండగా, ఆ తర్వాత స్మృతి(3,585), హర్మన్ ప్రీత్ (3,565) ఉన్నారు. కాగా ఈ సిరీస్ తొలి రెండు వన్డేల్లో మంధాన సెంచరీలు చేసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news