మెగాస్టార్ చిరంజీవిని కలిసిన కేంద్రమంత్రి బండి సంజయ్

-

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు.హైదరాబాద్ లోని తన నివాసానికి వచ్చిన బండి సంజయ్ కి మెగాస్టార్ చిరంజీవి సాదర స్వాగతం పలికారు.కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి చిరంజీవితో బండి సంజయ్ కలిశారు.ఈ సందర్భంగా బండి సంజయ్ కుమార్ ను చిరంజీవి సన్మానించారు. చిరంజీవితో సమావేశమై పలు అంశాలపై చర్చించారు.ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లా వైరల్ అవుతున్నాయి.

దీనిపై బండి సంజయ్ సోషల్ మీడియాలో స్పందించారు. “అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారిని కలవడం ఎప్పుడూ సంతోషదాయకమే. చిరంజీవి గారు వినయశీలి, నా శ్రేయోభిలాషి. నేను విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి ఆయన సినిమాలకు అభిమానిని” అంటూ ఎక్స్(ట్విట్టర్) లో ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news