బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్..పూర్తీ వివరాలు..

-

నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లు అందుతున్నాయి.ఇప్పుడు కొలువుల జాతర మొదలైంది.వరుస దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉన్న ఖాళీలను పూర్తీ చేసేందుకు వరుస నోటిఫికేషన్ లను అందిస్తున్నారు. తాజాగా మరో ప్రముఖ బ్యాంక్ ఉద్యోగాలకు సంభంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేశారు.భారత ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన ఇండియన్‌ బ్యాంక్‌ పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్‌ జారీ చేసింది.చెన్నైలో పలు విభాగాలకు సంభందించిన విభాగాల్లో ఉన్న స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 24 మే న మొదలైంది. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 312 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఉద్యోగాలకు సంభందించిన ఖాళీలు పూర్తీ వివరాలు..

 

మొత్తం 312 ఖాళీలు..

వీటిలో సీనియర్‌ మేనేజర్లు, మేనేజర్లు, అసిస్టెంట్‌ మేనేజర్లు, చీఫ్‌ మేనేజర్‌ పోస్టులు ఉన్నాయి. క్రెడిట్‌, అకౌంట్స్‌, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, డేటా అనలిస్ట్‌, ఐటీ, డిజిటల్‌ బ్యాంకింగ్‌ వంటి విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు.పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా ఏదైనా గ్రాడ్యుయేషన్‌, సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌, సీఏ/ ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణత పొంది ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరి.అభ్యర్థుల వయసు పోస్టుల ఆధారంగా 23 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

పూర్తీ వివరాలు..
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అభ్యర్థులను రాత పరీక్ష/ ఆన్‌లైన్‌ టెస్ట్‌ ద్వారా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక ఉంటుంది.
ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఫీజుగా రూ.175, ఇతరులు రూ. 850 చెల్లించాల్సి ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
దరఖాస్తుల స్వీకరణకు 14-06-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
నోటిఫికేషన్ ను పూర్థిగా చదివి ఉద్యొగాలకు అప్లై చేసుకోవాలి..

 

Read more RELATED
Recommended to you

Exit mobile version