చావును సమీపంలో చూస్తేనే భారత్ మారుతుందా…?

-

రోడ్లమీద బస్సులు తదితర వాహనాలు తిరుగుతాయని తెలిసీ మన బండ్లు అడ్డంగ రోడ్ మీద పార్క్ చేస్తుంటాం ..
కానీ అదే రైలు కట్ట మీద పార్క్ చేయం .. ఎందుకు ..!! ?

ఎందుకంటే .. ఇక్కడ రోడ్డు మీద మన బండిని బస్సు తొక్కదు
అనే అపార నమ్మకం ..
అదే రైలు వంద శాతం తొక్కేస్తుందన్న భయం ..
అంటే మనిషిని భయం జాగ్రత్త వైపు నిబంధనల వైపు నడిపిస్తుంది ..

లిక్కరు ఎక్కువగ వాడితే చావొస్తుంది ..
అదే చావు స్పిరిట్ తాగినా వస్తుంది ..
కానీ ఇక్కడ వెంటనే చావొస్తుందనే భయం మనిషిని స్పిరిట్ లాంటి ద్రవాలను తాగకుండా ఆపుతోంది ..
అదే లిక్కరు తాగితే ఆ చావు ఇప్పుడు రాదనే గట్టి ధైర్యం ..

అంటే సగటు భారతీయుడు ఏ కొద్ది అవకాశం దొరికినా
నిబంధనలు పట్టించుకోడు ..

ఇండియాలో ఓ పదిరవై కరోనా కేసులున్నప్పుడు
విపరీతంగా భయపడ్డ జనాలు
ప్రస్తుతం వేలాది కేసులు వందలాది మరణాలను కూడ
లెక్కపెట్టటం లేదు ..
రాను రానూ కరోనా విషయంలో
కొన్ని మొండి ధైర్యాలకు లోనవుతున్నారు ..
ఆ ధైర్యంతోనే వైరస్ పట్ల భయం తగ్గిపోతోంది ..

1. ఆ వైరస్ తో ఇప్పటి వరకు ఇండియాలో మరణాలు తక్కువున్నాయి ..

2. ఇండియాకు వచ్చిన వైరస్ బలహీనమైనదట ..

3. మనమేపించుకున్న బీసీజీ టీకాల వల్ల ఆ వైరస్
మనల్నేమీ చేయదట ..

4. యూరోపియన్స్ కంటే మన ఇమ్యూనిటీ పవర్ ఎక్కువట

5. మన ఆహారపు అలవాట్లతో మనను కరోనా ఏమీ చేయదట ..

6. మరో పది పదిహేను రోజుల్లో కొత్త కొత్త మందులు వస్తున్నాయట

7. అన్నిటికంటే అతి ముఖ్యమైన ధైర్యం
‘వచ్చిన ప్రతొక్కరూ చావటంలేదు .. ఓ పడిపన్నెండు శాతం మాత్రమే అది కూడ ముసలి వారు పోతున్నారు’ అనేది ..

‘కరోనా వచ్చిన ప్రతొక్కరూ చావరు’ అనే ధైర్యమే
మన చేత లాక్ డౌన్ నిబంధనల్ని ఉల్లంఘించేట్టు చేస్తున్నాయి ..

మాస్ మెంటలిటీని మార్చటం అంత వీజీ కాదు
చావును సమీపంలో చూస్తే తప్ప ..

Read more RELATED
Recommended to you

Exit mobile version