2014 సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం మరియు బిజెపి కలసి పోటీ చేసి అధికారంలోకి రావడం జరిగింది. కాగా 2019 ఎన్నికల్లో రెండు పార్టీలు విడిపోయి ఎవరికి వారు పోటీచేయగా ఇద్దరికీ పెద్ద లాభాలేమి జరగలేదు. తెలుగుదేశం పార్టీ చాలా దారుణంగా ప్రతిపక్షంలో కి వెళ్ళిపోయింది. ఇక బిజెపి అయితే ఖాతా కూడా తెరవలేదు. సరిగ్గా సార్వత్రిక ఎన్నికలకు సంవత్సరం ఉందనగా చంద్రబాబు బీజేపీ పార్టీని తీవ్ర స్థాయిలో విమర్శించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మోడీ మోసం చేశారని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.
దీంతో బిజెపి పార్టీ హైకమాండ్ కూడా టిడిపితో కలిసి పని చేయడానికి రెడీ అయినట్లు సరికొత్త ప్లాన్ తో ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీపై పోరాటానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. కరోనా వైరస్ కట్టడి చేయడంలో వైసీపీ ప్రభుత్వం ముందునుండి వ్యవహరించిన తీరును, అలాగే కరోనా ఈ విషయాన్ని చాలా తేలికగా తీసుకుని జగన్ ఎన్నికలు అంటూ అనుసరించిన విధానాన్ని భారీ ఎత్తున ప్రశ్నించడానికి టిడిపి బిజెపి కలిసి ఆలోచన చేస్తున్నట్లు ఏపీ రాజకీయాల్లో టాక్ వినపడుతోంది.