ఇండియాలో సెక్స్ టాయ్స్ ఇక లీగల్.. షాప్ కూడా ఓపెన్ చేసేశారు !

సెక్స్ టాయ్స్ అనే వాటి గురించి మన భారత్ లో మాట్లాడడం అంటే నిషిద్ధం అనే చెప్పాలి. అయితే గత కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియాలో ఋతుస్రావం మరియు శానిటరీ ప్యాడ్‌లు వంటి ముఖ్యమైన అంశాల గురించి చాలా మంది మాట్లాడుతున్నా ఇప్పటికీ సెక్స్ లాంటి విషయాలు ఎవరూ పెద్దగా మాట్లాడరు. అలాగే వాటిలో ఈ సెక్స్ టాయ్స్ అనే అంశం కూడా ఒకటి. కానీ ఇప్పుడు, గోవాకు చెందిన ఒక వ్యాపారవేత్త కలాంగూ ట్‌లో భారతదేశపు మొట్టమొదటి చట్టబద్దమైన సెక్స్ షాపును ప్రారంభించడం ద్వారా ఈ నిషేధాన్ని అంతం చేసే విషయంలో ఒక సాహసోపేతమైన చర్యకు పూనుకున్నారు.

‘కామ గిజ్మోస్’ పేరుతో గోవాలో సెక్స్ టాయ్స్ అలాగే వెల్ నెస్ ప్రొడక్ట్స్ షాప్ ప్రారంభించారు. ఇక ఇది భారత్ లో మొట్టమొదటి సెక్స్ టాయ్స్ షాప్ ఇది. కామకార్ట్ మరియు గిజోమోస్వాలా అనే ఇద్దరు సెక్స్ ప్రొడక్ట్ రిటైలర్లు భాగస్వామ్యంతో ఈ స్టోర్ మొదలు పెట్టారు. 2020 లో లాక్ డౌన్ సమయంలో భారతదేశంలో సెక్స్ టాయ్స్ అమ్మకం 65% పెరిగింది. ఈ టాయ్స్ డిమాండ్ ఉన్నప్పటికీ, సెక్స్ టాయ్స్ ను విక్రయించే వెబ్‌సైట్లు కొన్ని మాత్రమే ఉన్నాయి. ఇక కొన్ని షాపులు నడుస్తున్నా ఇవన్నీ అనధికారికంగా నడుస్తున్నాయి.