భారతదేశ మొదటి ప్రధానిమంత్రి స్వర్గీయ జవహర్ లాల్ నెహ్రు అని మనము అంతా నేర్చుకున్నాము. కానీ తాజాగా కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ్ పాటిల్ ఒక కొత్త సందేహాన్ని మన ముందుకు తీసుకువచ్చారని చెప్పాలి. ఈయన తాజాగా మాట్లాడుతూ భారత మొదటి ప్రధాని నెహ్రు కాదని శుభాష్ చంద్రబోస్ అన్నారు. ఎందుకంటే… గతంలో మనకు స్వాతంత్య్రం రాక ముందు చంద్రబోస్ కు భయపడే బ్రిటిష్ వారు దేశాన్ని వదిలి వెళ్లిపోయారు అంటూ వివరించారు. అందుకే నా వరకు బ్రిటిషర్లు ను భయపెట్టిన శుభాష్ చంద్రబోస్ మొదటి ప్రధాని అంటూ కామెంట్ చేశారు పాటిల్. ఇక రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత కొన్ని ప్రాంతాలలో మాత్రమే స్వాతంత్ర్యాన్ని ఇచ్చారని క్లారిటీ ఇచ్చాడు పాటిల్.
అప్పుడు స్వాతంత్య్రం పొందిన ప్రాంతాలకు సొంతంగా కరెన్సీ మరియు జెండా ఉన్నాయని అందుకే భారత్ కు మొదటి ప్రధాని నెహ్రు కాదన్నారు. కాగా ఈ వ్యాఖ్యల పట్ల ఖచ్చితంగా కాంగ్రెస్ నుండి ఎవరో ఒకరు స్పందించే అవకాశం ఉంది.