ప్రాణం తీసిన సరదా..అమెరికాలో విషాదం..!!!

వైద్య వృత్తి చేపట్టాలని కలలు గన్న ఓ భారతీయ విద్యార్ధి కల విషాదంతో ముగిసింది. ఎన్నో ఆశలతో అమెరికాలో వైద్య విద్యని అభ్యసించడానికి వెళ్ళాడు. తల్లి తండ్రుల కి దూరంగా ఉన్నా వైద్య వృత్తిని చేపట్టాలనే అతని బలైన కోరిక అతడిని ఉన్నత చదువులకి గాను అమెరికా వెళ్ళేలా చేసింది. అయితే ఊహించని విధంగా ఆ విద్యార్ధి మృతి చెందటంతో అతడి కుటుంభంలో విషాదం అలుముకుంది.వివరాలలోకి వెళ్తే..

అమెరికాలో ఓ ప్రవాస భారతీయ వైద్య విద్యార్ధి మృతి చెందారు. ఈ విషాదకర ఘటన ఫిలడెల్ఫియాలో చోటు చేసుకుంది. వివేక్ సుబ్రమని అనే యువకుడు ద్రెగ్జిల్ మెడికల్ కాలీజీలో వైద్య విద్య చదువుతున్నాడు. ఖాళీ సమయం అవడంతో అతడి స్నేహితులతో కలిసి నిన్నటి రోజున సాయంత్రం తను నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ పైకి వెళ్ళాడు. ఈ క్రమంలో ఒకరి తరువాత మరొకరుగా ఒక బిల్డింగ్ మీద నుంచీ మరొక బిల్డింగ్ మీదుగా దూకుతూ ఆట ఆడుతున్నారు. వివేక్ కూడా బిల్డింగ్ మీద నుంచీ దూకుతున్న క్రమంలో

 

అదుపుతప్పి ఒక్క సారిగా అంత పెద్ద బిల్డింగ్ మీద నుంచీ జారిపడ్డాడు. ఈ పరిణామంతో షాక్ అయిన స్నేహితులు పరుగు పరుగున వివేక్ వద్దకి వెళ్ళగా రక్తంతో కొట్టి మిట్టాడుతున్నాడు. వెంటనే స్పందిచిన స్నేహితులు అతడిని ఆసుపత్రికి తరలించే లోగానే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివేక్ డ్రింక్ చేసి ఉన్నాడా అనే అనుమానాలని వ్యక్తం చేస్తున్నారని స్థానిక మీడియా తెలిపింది.