పాపం తెలంగాణా బిజెపి… కెసిఆర్, కేటిఆర్ దెబ్బకు…!

-

తెలంగాణాలో బిజెపి ఆరు, ఏడు వందల చోట్ల అభ్యర్ధులు గతి లేరు. ఆ పార్టీకి మేము ఎందుకు భయపడతాం…?” సోమవారం జరిగిన సోషల్ మీడియా కార్యకర్తల సమావేశంలో తెలంగాణా మంత్రి కేటిఆర్ చేసిన వ్యాఖ్యలు ఇవి. మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించి తెరాస కు చుక్కలు చూపించాలని భావిస్తున్న భారతీయ జనతా పార్టీని ఉద్దేశించి మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బిజెపిని ఇబ్బంది పెడుతున్నాయి.

వాస్తవానికి తెలంగాణాలో నాలుగు ఎంపీ స్థానాలు గెలిచిన ఆ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో నిలబెట్టడానికి వార్డుల్లో కూడా అభ్యర్ధులు లేక ఇబ్బందులు పడుతున్న విషయం అందరికి తెలిసిందే. ఈ తరుణంలో ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కేటిఆర్ ఇద్దరు కలిసి ఆ పార్టీని మానసికంగా దెబ్బ కొడుతున్నారు. ఆ పార్టీ మీద రాజకీయ విమర్శలు చేయకుండా, అసలు మీకు నాయకత్వం లేదని మాట్లాడటంతో ఆ పార్టీ ఎం సమాధానం చెప్పలేకపోతుంది.

కెసిఆర్ అసలు బిజెపిని లెక్కలోకి తీసుకోవద్దని చెప్పారు. కేటిఆర్ అసలు బిజెపికి గతి లేదు అన్నారు. దీనితో తెలంగాణా బిజెపి నాయకులు ఎం చెప్పాలో అర్ధం కాక అవస్థలు పడుతున్నారు. అభ్యర్ధులను నిలబెట్టి ఉంటే ఏదొకటి చెప్పుకునే వారు. అది జరగకపోవడంతో ఇప్పుడు బిజెపి చుక్కలు చూస్తుంది. ఈ ఎన్నికల్లో గనుక బిజెపి ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయినా సరే వెనక్కు తగ్గి సర్దుకోవడం బెస్ట్ అంటున్నారు పరిశీలకులు.

Read more RELATED
Recommended to you

Latest news