రెండు జట్లకు ఆ ఎనిమిది మందే బలం, వాళ్ళే కీలకం…!

-

భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్ అనగానే ఉండే ఉత్కంట అంతా ఇంతా కాదు. రెండు జట్లు కూడా బలమైనవి, పటిష్టమైనవి కావడంతో అభిమానులకు మంచి వినోదం కూడా దొరుకుతుంది. ఇక ఈ రెండు జట్లలో కూడా ప్రపంచ స్థాయి ఆటగాళ్ళు ఎక్కువగా ఉన్నారు. మ్యాచ్ ఫలితాన్ని యిట్టె మలుపు తిప్పెయగల ఆటగాళ్ళు రెండు జట్లలో ఉండటంతో పోరు గట్టిగానే ఉంటుంది. ఒకసారి రెండు జట్లలో కీలక ఆటగాళ్లను చూస్తే…

ఇండియా విషయానికి వస్తే, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి టీం ఇండియా ప్రధాన బ్యాటింగ్ బలం. ధావన్ ఆడతాడో లేదో చెప్పలేని పరిస్థితి. ఇక మిడిల్ లో శ్రేయాస్ అయ్యర్ కీలకమే అయినా రోహిత్, కోహ్లి మీదే ఎక్కువగా భారం ఉంటుంది. వీరిద్దరూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే టీం ఇండియాకు భూమ్రా, మహ్మద్ శమీ ఇద్దరు బలమే. ఇక స్పిన్నర్లు చాహల్, కుల్దీప్ ప్రదర్శన మీద నమ్మకం లేదు.

ఆస్ట్రేలియా విషయానికి వస్తే, ఓపెనర్ డేవిడ్ వార్నర్, మరో బ్యాట్స్మెన్ స్టీవ్ స్మిత్ ఇద్దరూ కూడా ఆ జట్టుకి కీలక౦. వాళ్ళను అవుట్ చేస్తే మ్యాచ్ టీం ఇండియాదే. అయితే ఈ మధ్య లబూస్చాగ్నే కీలకంగా మారాడు. మరో ఓపెనర్ ఆరోన్ ఫించ్ కూడా మ్యాచ్ ఫలితాన్ని మార్చేస్తాడు. బౌలింగ్ విషయానికి వస్తే పేసర్ మిచెల్ స్తార్క్, ప్యాట్ కమ్మిన్స్ ఇద్దరూ కూడా జట్టుకి ప్రధాన బలం. ఇలా రెండు జట్ల మధ్య 8 మంది కీలక ఆటగాళ్ళు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news