ఎన్నికల సిత్రాలు : ఓటు వినియోగించుకునేందుకు తరలివస్తున్న వికలాంగులు !

-

5 రాష్ట్రాల ఎన్నికల్లో నేడు కీలక ఘట్టం చోటు చేసుకోనుంది. అన్ని పార్టీలు అత్యంత కీలకంగా భావిస్తున్న పంజాబ్ రాష్ట్రంలో నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. పంజాబ్ లోని 117 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగనుండగా… 2.14 కోట్ల మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. 1304 మంది అభ్యర్థులు తమ లక్ ను పరీక్షించుకోనున్నారు.

ఉత్తర్ ప్రదేశ్ లో ఈరోజు మూడో విడత పోలింగ్ జరుగనుంది. 59 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. 627మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 2.15 కోట్ల మంది ఓటర్లు ఎన్నిలకల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇదిలా ఉండగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పోలింగ్ చాలా ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలివస్తున్నారు.

ముఖ్యంగా వృద్ధులు అలాగే వికలాంగులు కూడా ఓటింగ్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) సిబ్బంది, ఫతేఘర్, హత్రాస్ మరియు హమీర్‌పూర్‌లోని పోలింగ్ బూత్‌ల వద్ద మోహరించి, వృద్ధులకు మరియు వికలాంగ ఓటర్లకు సహాయం చేస్తున్నారు. దీనికి సంబందించిన ఫోటోలు వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news