వేసవి సెలవుల నేపథ్యంలో విజయవాడ ఇంద్రకీలాద్రికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఇక ఈ టెంపుల్ భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది. భవానీదీక్షలు, దసరా నవరాత్రుల తరహాలో రోజుకు సుమారు 50 వేల మంది భక్తులు వస్తున్నారని సమాచారం.
భగభగ మండి సూర్యుని ఎండలను లెక్క చేయకుండా సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్ లలో బారులు తీరుతున్నారు. దీంతో రూ.25 లక్షల దాకా టిక్కెట్ల ఆదాయం జమ అవుతోంది. ఎక్కువ శాతం మంది తమ సొంత వాహనాలతో వస్తుండడం వల్ల పార్కింగ్ సమస్య ఎక్కువగా తలెత్తుతుంది. కనకదుర్గానగర్‌లో అభివృద్ధి పనుల కారణంగా పార్కింగ్ స్థలం కొరత ఏర్పడింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్టు ఈవో కేఎస్ రామారావు వెల్లడించారు.