సంక్రాంతికి ఊరెళ్తున్నారా? పోలీసులకు చెప్పి వెళ్లండి..!

-

Inform the police before going to villages for sankranthi festival

సంక్రాంతికి మీ ఊళ్లకు పయనమవుతున్నారా? ఇంటికి లాక్ వేసి వెళ్తున్నారా? ఓసారి పోలీసులకు కూడా సమాచారం ఇవ్వండి. వాళ్లకు చెప్పి వెళ్లండి. లేకపోతే.. ఈ ఇంటిని దొంగలు ఊడ్చేస్తారు. అవును… నగరంలో ఇప్పుడు దొంగల హడావుడి ఎక్కువగా ఉంది. సంక్రాంతికి తమ ఇంటికి తాళాలు వేసి ఊళ్లకు వెళ్లిన వారి ఇండ్లనే దొంగలు టార్గెట్ చేస్తున్నారు. ఇటువంటి ఘటనలు కూడా జరిగాయి. అందుకే… ఊరెళ్లేముందు పోలీసులకు సమాచారం ఇవ్వాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు.

ముఖ్యంగా నగర శివార్లలోని తాళం వేసి ఉన్న ఇండ్లను వాళ్లు టార్గెట్ చేసుకుంటున్నారు. ఇరుగు పొరుగు వారికి కూడా చెప్పి వెళ్లాలని… ఆ ప్రాంతంలోని సెక్టార్ ఎస్సైకి చెబితే సరిపోతుందని అంజనీ తెలిపారు.

సంక్రాంతి కోసం నగరం నుంచి చాలా మంది తమ సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో నగరం సగం ఖాళీ అయిపోయింది. రోడ్లన్నీ బోసిపోతున్నాయి. ట్రాఫిక్ జామ్ కూడా తగ్గింది. ముఖ్యంగా ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారంతా సంక్రాంతి కోసం తమ ఊళ్లకు వెళ్లారు.

Read more RELATED
Recommended to you

Latest news