గత సంవత్సరం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ 40 వేల మందికి ఉద్యోగ అవకాశాన్ని కల్పించింది. అయితే ఈ ఆర్థిక సంవత్సరం 2021 కూడా అంత మందిని తీసుకుంటుందని అంచనాలు వేస్తున్నారు. లక్కడ్ చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ TCS కొన్ని విషయాలు చెప్పారు.
వాళ్ళ ఆపరేటింగ్ మోడల్ చాలా విభిన్నంగా ఉంటుందని అయితే వచ్చే వాళ్ల బట్టి విధానం ఉంటుందని అన్నారు. సంవత్సరంలో నేషనల్ క్వాలిఫైయింగ్ టెస్ట్ నాలుగు సార్లు అయిందని ఎక్కువ మందిని తీసుకుంటున్నామని అన్నారు. అలానే ఆయన ఎక్కువమందిని ఇప్పుడు కూడా తీసుకుంటున్నట్టు చెప్పారు.
అలానే రానున్న సంవత్సరం లో టెక్నాలజీ టైప్లో మరింత ఇన్వెస్ట్ చేస్తామని వెల్లడించారు. టిసిఎస్ కాన్స్ టెంట్ కరెన్సీ రెవెన్యూ గ్రోత్ 4.2 శాతం జనవరి మార్చ్ 2021లో పెరిగిందన్నారు. మార్చితో ముగిసిన పూర్తి ఏడాది (2020–21)లో టీసీఎస్ నికర లాభం రూ. 32,340 కోట్ల నుంచి రూ. 33,388 కోట్లకు బలపడింది. అయితే ఇది న్యాయపరమైన క్లెయిముల ప్రొవిజన్లు మినహాయించి ప్రకటించిన నికర లాభంకాగా.. నికరంగా చూస్తే రూ. 32,430 కోట్లు ఆర్జించింది. ఇది ఇలా ఉంటే ఎపిక్ సిస్టమ్స్ కార్పొరేషన్‌కు సంబంధించిన న్యాయవివాదానికి కంపెనీ రూ. 1,218 కోట్లు (16.5 కోట్ల డాలర్లు) కేటాయించింది.
ఇక మొత్తం ఆదాయం 4.6 శాతం పుంజుకుని రూ. 1,64,717 కోట్లయ్యింది. అయితే గతం లో రూ. 1,56,949 కోట్ల టర్నోవర్‌ను సాధించింది మరియు నెట్ ప్రాఫిట్ 6.3 శాతం పెరిగింది. జనవరి మార్చి లో నెట్ ప్రాఫిట్ 6 .3 శాతం నుండి రూ 9,246 కోట్లకి పెరిగింది. క్వార్ట్రర్ లో రెవెన్యూ నాలుగు శాతం నుండి రూ 43, 705 కోట్లకి పెరిగింది. అంటే సెప్టెంబర్ 2015 నుండి చూస్తే 25 బేసిన్ పాయింట్స్ పెరిగింది.
అలానే భారతీయ రెండవ అతిపెద్ద సాఫ్ట్వేర్ సర్వీస్ ఇన్ఫోసిస్ 26,000 మందిని కళాశాల నుంచి తీసుకుంటున్నట్లు చెప్పింది. ఆర్ధిక సంవత్సరం 2021 కరోనా కారణంగా కొన్ని ఇబ్బందులు వచ్చాయని రావ్ అన్నారు. ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ డిజిటలైజేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ని మెయింటెన్ చేశామని డిజిటల్ బిజినెస్ 50% కంటే ఎక్కువ ఉందని చెప్పడం జరిగింది. ఇన్ఫోసిస్ రెండంకెల ఆదాయాన్ని పొందినట్లు చెప్పడం జరిగింది.
మొత్తం 14.1 బిలియన్ కాంట్రాక్ట్ వాల్యూ అని చెప్పారు. అయితే ఇందులో 66% డీల్ కొత్త కాంట్రాక్ట్ అని అన్నారు. అలానే కంపెనీ పదివేల రూపాయల కోట్లను రెవెన్యూ కి చేరుకుంది అని అన్నారు. 2021లో ఇదే అది పెద్ద పతనం. అయితే దేశంలోని రెండవ అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సేవల సంస్థ ఇన్ఫోసిస్ మాత్రం లాభాలతో మురిపించింది. దాదాపు ఒకటి నుంచి ఒకటిన్నరశాతం ఈక్విటీకి సమానమైన షేర్లను ఇన్వెస్టర్ల నుంచి ఇన్ఫోసిస్ తిరిగి కొనుగోలు చేయనుందని కూడా తెలిపింది.
అదనంగా, ఇన్ఫోసిస్ ఒక్కో షేరుకు 15 రూపాయల తుది డివిడెండ్ను ప్రతిపాదించింది. ఇప్పటికే చెల్లించిన షేరుకు రూ. 12 మధ్యంతర డివిడెండ్ తో కలిపి, ఎఫ్‌వై 21 కోసం మొత్తం డివిడెండ్ రూ .27 గా వుంది. ఇది ఎఫ్వై 20 కన్నా 54% పెరుగుదల వుంది. దీనితో కంపెనీ మొత్తం డివిడెండ్‌ను రూ .11,500 కోట్లు ప్రకటించింది. ఎఫ్వై 21, ఐటి కంపెనీ ఈ విషయాన్నీ ఒక ప్రకటనలో తెలిపింది.
నోయిడా అథారిటీ నోయిడా ప్రాంతాలలో ఇండస్ట్రియల్ ల్యాండ్ ని తీసుకుని 13 కంపెనీలు ప్రారంభించింది. వీటిలో అదానీ ఎంటర్ప్రైజెస్ మరియు డిక్సన్ టెక్నాలజీస్ కూడా ఉన్నాయి దీని కోసం మొట్టమొదట రూ 3870 కోట్లు పెట్టినట్లు తెలుస్తోంది.
కంపెనీ 2,500 కోట్ల రూపాయలు నోయిడాలో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటోంది అయితే వీళ్ళ తీసుకునే స్టెప్స్ వల్ల ఉద్యోగ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. స్టేట్మెంట్ ప్రకారం ల్యాండ్ కోసం అరవై ఫిర్మ్స్ అప్లై చేయగా 13 కంపెనీలు ఎలిజిబుల్ అయినట్లు తెలుస్తోంది.
నోయిడా అథారిటీ 344 కోట్ల రూపాయలు ఇన్కమ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తోంది.. దీనితో 3,870 కోట్ల రూపాయలు నోయిడాలో ఇన్వెస్ట్ చేసి 48,512 ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలుస్తోంది.