మంచిర్యాలలో అమానుషం.. తిండి పెట్టకపోవడంతో 8 కుక్కల మృతి!

-

మంచిర్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పశు సంరక్షణ కేంద్రంలో 10 రోజులుగా తిండి లేక 8 వీధి కుక్కలు మృతి చెందగా, కొనఊపిరితో 12 శునకాలు కొట్టుమిట్టాడుతున్నాయి.మున్సిపాలిటీ సిబ్బంది ఇటీవల వాటిని బంధించగా, సిబ్బంది తిండిపెట్టకుండా మర్చిపోయినట్లు సమాచారం. ఆస్పత్రి నుంచి భరించలేని దుర్వాసన వస్తుండటం స్థానికులు గుర్తించారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చిన దారుణం.

వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసేందుకు మంచిర్యాలలో ప్రత్యేకంగా ఓ ఆస్పత్రిని ఏర్పాటు చేయగా.. అక్కడ వాటిని కట్టేశారు.ఆస్పత్రిలో రోజూ 15 శునకాలకు శస్త్రచికిత్సలు చేస్తుంటారు. ఈ క్రమంలో 15 రోజుల క్రితం 20 శునకాలను సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. సెప్టెంబరు, అక్టోబరు నెలలో సిబ్బందికి జీతాలు ఇవ్వకపోవడంతో యాజమాన్యాన్ని నిలదీశారు. దీంతో డాక్టర్ మినహా అందరినీ 10 రోజుల కిందట ఉద్యోగం నుంచి తీసేశారు. నాటి నుంచి ఆస్పత్రికి ఎవరూ రావడం లేదని తెలిసింది. దీంతో వాటి ఆలనాపాలన చూసే వారు లేక ఆకలితో అలమటించి 8 కుక్కలు వారం కిందట చనిపోయినట్లు తెలిసింది. మరణించిన శునకాల కళేబరాలు తొలగించే వారు కూడా లేకపోవడంతో ఆ ప్రాంతమంతా తీవ్ర దుర్గంధం వ్యాపించింది.

Read more RELATED
Recommended to you

Latest news