నేను హైదరాబాద్‌లోనే ఉన్నా.. రేవంత్‌కు కేటీఆర్ బర్త్ డే విషెస్!

-

సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆయనకు బర్త్ డ్ విషెస్ తెలిపారు. అంతేకాకుండా తాను హైదరాబాద్ లోనే ఉన్నానని.. మీ ప్రభుత్వ ఏజెన్సీలు ఎప్పుడైనా రావొచ్చని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మీ బర్త్ డే సందర్భంగా కావాలంటే కేక్ కట్ చేయిస్తా.. చాయ్, ఉస్మానియా బిస్కెట్లు కూడా ఇస్తానంటూ సెటైర్లు వేశారు.

గతంలో బీఆర్ఎస్ పాలనలో ఉన్నప్పుడు హైదరాబాద్‌లో ఈ కార్ రేసింగ్ నిర్వహించినప్పుడు ప్రభుత్వ నిధులు రూ.55కోట్లను కేటీఆర్ దుర్వినియోగం చేశారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి.ఈ విషయాన్ని కేటీఆర్ సైతం మీడియా ముఖంగా అంగీకరించారు. తాను సొంతంగా వాడుకోలేదని ప్రభుత్వం తరఫున ఈ రేసింగ్ నిర్వహించామని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచామని చెప్పుకొచ్చారు.ఈ వ్యవహారంలో కేటీఆర్‌‌ను ఎప్పుడైనా అరెస్టు చేసే చాన్స్ ఉందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ట్వీట్ వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news