ఏపీ రైతులకు జగన్ మోహన్ రెడ్డి అదిరిపోయే శుభవార్త చెప్పారు. కాసేపటి క్రితమే రైతన్నల ఖాతాల్లో ఇన్పుట్ సబ్సిడీని విడుదల చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. సీఎం క్యాంపు కార్యాలయం మించి ఈ నిధులను విడుదల చేశారు సీఎం జగన్. ఇక ఇన్పుట్ సబ్సిడీ కొరకు ఏకంగా ఐదు వందల ముప్పై నాలుగు కోట్లు విడుదల చేసింది జగన్మోహన్ రెడ్డి సర్కార్.
దీని ద్వారా ఏకంగా 5.17 లక్షల మంది రైతులకు కు లబ్ధి చేకూరనుంది. ఈ నిధులు విడుదల చేసిన అనంతరం సీఎం జగన్ మాట్లాడారు. గత రెండు సంవత్సరాల నుంచి వర్షాలు బాగా కురుస్తున్నాయి అని… రిజర్వాయర్ నీటి తో కళకళలాడుతున్న ఆయన పేర్కొన్నారు. వరదలతో కొన్ని చోట్ల పంటలు నష్టపోయారని తెలిపారు. ఈ సీజన్ లో నష్టానికి అదే సీజన్లో పరిహారం ఇస్తామని ప్రకటించారు. ఏపీ రైతులకు ఎల్లవేళలా తాము అండగా ఉంటామని.. వారికి కష్టాలు రాకుండా చూస్తామని హామీ ఇచ్చారు జగన్.