కల్వకుంట్ల రాజ్యాంగం వస్తే.. రిజర్వేషన్లు రావు. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

-

కల్వకుంట్ల రాజ్యాంగం వస్తే.. మనకు రిజర్వేషన్లు రావని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచనల వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లు లేకుండా చేయాలన్నదే కేసీఆర్ ప్లాన్ అని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రాజ్యాంగాన్ని మారుస్తా అని అందుకే అంటున్నారని అన్నారు. కల్వకుంట్ల రాజ్యాంగం వస్తే మనకు ఉద్యోగాలు, డబుల్ బెడ్రూంలు రావని బండి సంజయ్ ఆరోపించారు. ఉద్యోగాల గురించి అడుగుతామని, హక్కులు, విద్య గురించి ప్రశ్నిస్తామని కేసీఆర్ రాజ్యాంగం మార్చాలని వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. దళిత, గిరిజనులకు హక్కులు ప్రసాదించిన రాజ్యాంగాన్ని మార్చాలంటున్నారని ఫైర్ అయ్యారు. పోడు భూముల సమస్యల అలాగే ఉంటుందని ఆయన  అన్నారు. గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు బాధ్యత బీజేపీదే అని ఆయన అన్నారు. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని ఆరోపించారు. దళిత గిరిజనులకు రాజ్యాంగం అందిస్తున్న ఫలితాలను ఎత్తేయాలన్నదే కేసీఆర్ ప్లాన్ అని.. అందుకే రాజ్యాంగం మార్చాలని అంటున్నారని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version