స్ఫూర్తి : వయస్సు 19… సంపాదన వెయ్యి కోట్లు…!

-

జీవితంలో అందరూ పైకి రాలేరు. రోజు చాలా మంది జీవితాల్లో ఏదో చేసేద్దాం అని అనుకుంటూ వుంటారు. పైగా జీవితంలో పైకి రావడానికి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. కానీ నిజానికి జీవితంలో పైకి రావాలంటే ప్రయత్నం చాలా ముఖ్యమైనది. అలానే ఒక గోల్ ని పెట్టుకుని దానికి తగ్గట్టుగా అనుసరిస్తే కచ్చితంగా పైకి రాగలుగుతారు.

 

నిజంగా జీవితంలో పైకి రావాలని… రాలేకపోతున్న వాళ్ళకి ఈ 19 ఏళ్ల కుర్రాడు ఆదర్శం. ఎందుకంటే వయసు చూస్తే పంతొమ్మిది సంపాదన చూస్తే వెయ్యి కోట్లు. ఇంతకీ అసలు ఈ కుర్రాడు ఏం చేస్తున్నాడు ఎలా ఇంత డబ్బు సంపాదిస్తున్నాడు అనేది ఇప్పుడు చూద్దాం.

19 ఏళ్ల వయసులోనే కోట్లు ఆశిస్తున్న వ్యక్తుల జాబితాలో నిలిచాడు కైవల్య వోహ్రా. క్విక్ గ్రోసరీ డెలివరీ ఆప్ జిప్టో సహవ్యవస్థాపకుడు కైవల్య వోహ్రా. అలానే పాలిచా అనే మరో కుర్రాడు కూడా ఆదర్శమే. ఈ కుర్రాడి వయసు 20 సంవత్సరాలు. వీళ్లిద్దరు స్టాండ్‌ఫర్డ్ యూనివర్సిటీ లో చదువుకున్నారు. అయితే వీళ్లిద్దరు కలిసి జిప్టో Zepto మొదలుపెట్టారు.

కోట్లు ఆర్జిస్తూ స్ఫూర్తిగా నిలిచారు. కష్టాన్నే నమ్ముకుని స్వయంకృషితో వీళ్లిద్దరు పైకి వచ్చారు. పైగా వోహ్రా రూ.1000 కోట్లతో ధనవంతుల లిస్ట్ లో 1,036వ స్థానంలో ఉండగా పలిచ రూ.1,200 కోట్లతో 950వ స్థానంలో వున్నాడు .ముంబై కి చెందిన ఈ కంపెనీ ఇప్పుడు పది నగరాల్లో 1000 మందికి పైగా ఉద్యోగులతో దూసుకుపోతోంది. 3000కు పైగా కిరాణా వగైరా సామాన్లను డెలివరీ చేస్తోంది ఈ కంపెనీ.

చాలా మంది ఏదో చేయాలని చేయలేకపోతు ఉంటారు పైగా బద్ధకంతో ఆగిపోవడం మంచి సమయం కోసం ఎదురు చూడటం.. చేద్దాంలే అని వదిలేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు దీని వలన అస్సలు ముందడుగు వేయలేరు కాబట్టి ఎప్పుడూ కూడా ప్రయత్నం చేయాలి. అలానే ఒక గోల్ సెట్ చేసుకుని ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్తే కచ్చితంగా సక్సెస్ అవ్వొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news