సెక్యూరిటీ విషయంలో ఐర్లాండ్ రెగ్యులేటర్లు ఇన్‌స్టాగ్రామ్‌పై భారీ జరిమానా విధించారు. యువత గోప్యత విషయంలో నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ ఇన్‌స్టాగ్రామ్‌కు 32 బిలియన్ల భారీ జరిమానా విధించింది. యువత ఫోన్ నంబర్లు, ఈ-మెయిల్ గోప్యత విషయంలో నిబంధనలు ఉల్లంఘించిందని పేర్కొంది. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది.
సైబర్ నేరగాళ్లు ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో ఉన్న వ్యక్తిగత డేటాను సేకరించడానికి ప్రయత్నిస్తున్నారు. టెక్నాలజీని ఉపయోగించి వ్యాపార ఖాతాలను అప్‌గ్రేడ్ చేస్తున్నారు. వ్యక్తిగత డేటాను సేకరించి అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా ఈ జరిమానాపై అప్పీల్ చేసేందుకు సిద్దమైంది. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్ మూడుసార్లు జరిమానా విధించింది.