దొరికేశాడుగా: రిజల్ట్స్ భయంతో పారిపోయిన స్టూడెంట్ ఆచూకీ లభ్యం !

-

నిన్న సాయంత్రం ఏపీలో ఇంటర్ మొదటి మరియు రెండవ సంవత్సర పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. ఇందులో ఎక్కువ శాతం పాస్ అయినట్లుగా రాష్ట్ర విద్యశాఖ అధికారులు తెలియచేశారు. ముఖ్యంగా ఈ ఫలితాలలో అమ్మాయిలదే హవా నడిచింది. కాగా రిజల్ట్స్ వస్తున్నాయి అంటే అందరికీ ఏదో ఒక రకమైన భయం ఉండనే ఉంటుంది. పాస్ అవుతామా అని కొందరు, ఎన్ని మార్కులు వస్తాయి అనుకున్నట్లు వస్తాయా అని మరికొందరు ఇలా ఆలోచనలతో చాలా ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారు. అయితే నిన్న మధ్యాహ్నం రిజల్ట్స్ భయంతో అన్నమయ్య జిల్లా పుల్లంపేటకు చెందిన మామిళ్ళ అనిరుద్ అనే అబ్బాయి ఇంటి నుండి చెప్పాపెట్టకుండా పారిపోయాడు.

నిన్నటి నుండి ఇతని కోసం గాలింపు చర్యలు చేపట్టగా ఈ రోజు మధ్యాహ్నం తిరుమలలో అనిరుద్ ను గుర్తించారు. కాగా ఇంత భయపడి పారిపోయిన అనిరుద్ మొదటి సంవత్సరం ఇంటర్ లో అనిరుద్ పాస్ అయ్యాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version