మాములుగా టూ వీలర్ లేదా ఫోర్ వీలర్ ను డ్రైవ్ చేయాలంటే తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఈ లైసెన్స్ ను పొందాలంటే RTO ఆఫీస్ లో అప్లికేషన్ పెట్టుకుని .. వారు ఆన్లైన్ లో కండక్ట్ చేసే పరీక్ష లో అప్స్ అయితేనే, డ్రైవింగ్ టెస్ట్ చేసి ఆ తర్వాత మీకు కొన్ని రోజులకు డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది. ఇదంతా పెద్ద తతంగం, పైగా కొందరు పరీక్షలోనే ఫెయిల్ అయ్యి అనర్హులుగా మిగిలిపోతుంటారు. అలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం శుభవార్తను తీసుకువచ్చింది. ఇకపై ఎటువంటి డ్రైవింగ్ టెస్ట్ లేకుండానే లైసెన్స్ ను ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ ను ఇచ్చే బాధ్యతను ఆయా డ్రైవింగ్ స్కూల్స్ కు కల్పించనుంది.
గుడ్ న్యూస్: టెస్ట్ లేకుండా డ్రైవింగ్ లైసెన్స్… !
-