Breaking : ఫెయిలైన తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు శుభవార్త

-

గత నెలలో తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈ ఇంటర్‌ ఫలితాలలో ఫెయిల్‌ అయిన విద్యార్థులకు ఇంటర్మీడియట్‌ బోర్డ్‌ అధికారులు శుభవార్త చెప్పారు. తెలంగాణ ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువును పొడిగిస్తున్న‌ట్లు అధికారులు వెల్లడించారు. ఫెయిలైన విద్యార్థులు ఈ నెల 8వ తేదీ వ‌ర‌కు ఆయా కాలేజీల్లో ఫీజు చెల్లించొచ్చ‌ని, విద్యార్థులు ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు ఇంటర్‌ బోర్డు అధికారులు. ఆగస్టు 1 నుంచి 10 వరకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వ‌హించ‌నున్నారు అధికారులు.

ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఫస్టియర్‌ విద్యార్థులకు, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 : 30 గంటల వరకు సెకండియర్‌ విద్యార్థులకు పరీక్షలుంటాయని అధికారులు తెలిపారు. జూలై 26 నుంచి 30 వరకు ప్రాక్టికల్స్‌ నిర్వహిస్తామని, ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వ్యాల్యూస్‌ ఎగ్జామ్‌ జూలై 22న, ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్ష జూలై 23న ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు ఉంటుందని తెలిపారు అధికారులు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version