ఏప్రిల్ 20 నుంచి ఇంట‌ర్ ప‌రీక్షలు

-

తెలంగాణ విద్యా శాఖ ఇంట‌ర్ ప‌రీక్షల‌పై కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. క‌రోనా వైరస్ వ్యాప్తి త‌గ్గ‌డంతో ఇంట‌ర్ ప‌రీక్షల తేదీల‌ను తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ ప్ర‌క‌టించింది. ఏప్రిల్ 20 నుంచి ఇంట‌ర్ ప్ర‌ధాన ప‌రీక్షలు నిర్వ‌హించాల‌ని తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ నిర్ణ‌యం తీసుకుంది. అంతే కాకుండా ఇంట‌ర్ ప్ర‌ధాన ప‌రీక్షల‌కు సంబంధించి షెడ్యూల‌ను కూడా రాష్ట్ర విద్యా శాఖ విడుద‌ల చేసింది.

ఈ షెడ్యూల్ ప్ర‌కారం ఏప్రిల్ 20 వ తేదీ నుంచి మే 5 వ తేదీ వ‌ర‌కు ఇంట‌ర్ ప్ర‌ధాన ప‌రీక్షలు నిర్వ‌హిస్తారు. అలాగే మే 6 నుంచి 9 తేదీల‌లో మైన‌ర్ ప‌రీక్షలు నిర్వ‌హిస్తారు. అలాగే మార్చి 23 వ తేదీ నుంచి ఏప్రిల్ 8 వ తేదీ వ‌ర‌కు ఇంట‌ర్ ప్రాక్టికల్ ప‌రీక్షలను నిర్వ‌హిస్తారు. అనంత‌రం ఏప్రిల్ 11 వ తేదీన ఎథిక్స్ అండ్ హుమన్ వాల్యూస్ పరీక్ష ల‌ను నిర్వ‌హిస్తారు. దీని త‌ర్వాత అంటే ఏప్రిల్ 12 వ తేదీన ప‌ర్యావ‌ర‌ణ కు సంబంధించిన ప‌రీక్షను రాష్ట్ర విద్యా శాఖ నిర్వ‌హించ‌నుంది.

Read more RELATED
Recommended to you

Latest news