తెలంగాణ‌లో నేడు కొత్త‌గా 1,380 క‌రోనా కేసులు

-

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ తో పాటు ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి త‌గ్గుముఖం ప‌డుతుంది. రోజు రోజు కు క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య గ‌ణ‌నీయంగా త‌గ్గుతుంది. తాజా గా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్ల‌డించిన క‌రోనా బులిటెన్ ప్ర‌కారం గ‌డిచిన 24 గంట‌ల‌లో రాష్ట్ర వ్యాప్తంగా 68,720 క‌రోనా వైర‌స్ నిర్ధార‌ణ ప‌రీక్షలు నిర్వ‌హించారు. దీంతో నేడు రాష్ట్ర వ్యాప్తంగా 1,380 క‌రోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.

దీంతో రాష్ట్రంలో నేటి వ‌ర‌కు వ‌చ్చిన పాజిటివ్ కేసుల సంఖ్య 7.78.910 కు చేరింది. అలాగే నేడు రాష్ట్రంలో ఒక‌రు క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఒక‌రు మృతి చేందారు. కాగ గ‌డిచిన 24 గంట‌ల‌లో రాష్ట్ర వ్యాప్తంగా 3,877 మంది క‌రోనా వైర‌స్ నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ప్ర‌స్తుతం 24,000 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ రేటు 96.39 శాతం గా ఉంది. అలాగే జీహెచ్ఎంసీ ప‌రిధిలో కూడా క‌రోనా వ్యాప్తి త‌గ్గుముఖం ప‌డుతుంది. గ‌డిచిన 24 గంట‌ల‌లో జీహెచ్ఎంసీ ప‌రిధిలో 350 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news