ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని తప్పిన వ్యవహారం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతుంది. రాష్ట్రంలో ఈ చర్య ఇలాంటి సమయంలో సరికాదు అనే అభిప్రాయాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో జగన్ ఇలాంటి నిర్ణయాల ద్వారా ప్రజల్లో చులకన అయ్యే ప్రమాదం ఉందని అధికార పార్టీ నేతలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక వెంటనే ఎన్నికల కమీషనర్ గా మద్రాస్ హైకోర్ట్ మాజీ న్యాయమూర్తిని కనగరాజు ని ఏపీ సర్కార్ నియమించింది.
ఈ మేరకు దస్త్రం సిద్దం చేసి రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చంద్ కి పంపగా ఆయన దాన్ని ఆమోదించారు. ఇప్పుడు దీనిపై కేంద్రం జోక్యం చేసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికలను నిర్వహిస్తే పరిస్థితి ఆందోళనకరంగా మారుతుందని అంటున్నారు. అయితే ఇక్కడ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అయన హైకోర్ట్ కి వెళ్లి… హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చెయ్యాలి అనుకోవడం తో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. ఇప్పుడు దీనిపై హైకోర్ట్ ఎం అంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.
తనకు ఇంకా పదవీ కాలం రెండేళ్ళు ఉన్నా సరే జగన్ ఏ విధంగా తనను తప్పిస్తారని రమేష్ కుమార్ ఆగ్రహంగా ఉన్నారు. ఇదే విషయాన్ని కోర్ట్ దృష్టికి తీసుకుని వెళ్ళాలి అనేది రమేష్ కుమార్ భావన. తన పదవీ కాల౦ ఉండగా తప్పించిన విషయాన్ని కోర్ట్ దృష్టికి తీసుకు వెళ్ళాలి అని భావించడం తో జగన్ సర్కార్ ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. రాజ్యాంగం 243కే అనే ఆర్టికల్ ప్రకారం ఇది రాజ్యాంగ విరుద్దం. కాబట్టి దీనిపై కోర్ట్ ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి. తేడా వస్తే సియేస్ ని కోర్ట్ కి పిలిచే అవకాశాలు ఉంటాయి.