త్వరలోనే గండిపేటకు గోదావరి నీళ్లు.. టెండర్లకు పిలుపునకు కసరత్తు!

-

తెలంగాణ సర్కార్ మూసీ పునరుజ్జీవంపై సీరియస్‌గా ఉన్నది. అందుకు సంబంధించి ఏర్పాట్లు సైతం చకాచకా సాగుతున్నాయి.ఈ క్రమంలోనే సెక్రటేరియట్ వేదికగా సంబంధిత అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. 15 రోజుల్లోనే గండిపేటలో గోదావరి నీళ్లు నింపేందుకు టెండర్లు పిలవడానికి ఏర్పాట్లు సైతం చేస్తున్నట్లు సమాచారం. తొలి దశలో గండిపేట నుంచి బాపూఘాట్‌ వరకు పనులను ప్రారంభిస్తారని తెలుస్తోంది.

మూసీ పునరుజ్జీవంలో భాగంగా బాపూఘాట్‌‌ను ముందుగా అభివృద్ధి చేసి అక్కడ గుజరాత్‌లోని సర్దార్ వల్లభాయ్ విగ్రహం కంటే అతిపెద్ద గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, మూసీ నదిలో ప్రవేశించే నీటిని శుద్ధి చేయడం ద్వారా నది ప్రక్షాళన చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది. అందులో భాగంగానే ఎస్టీపీలను రూ.7వేల కోట్లతో ఏర్పాటు చేయనున్నారు. శుద్ధి చేసిన నీరు మూసీలో కలుస్తుండటంతో నీటి కలుషితం తగ్గనుంది. అందుకోసం ఈ వారం టెండర్లను పిలవనుందని సమాచారం. ఇందుకోసం మల్లన్న సాగర్ నుంచి ఉస్మాన్ సాగర్‌కు నీటిని తరలించేందుకు ప్రత్యేక ప్రణాళికలను అధికారులు రూపొందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version