అసలు రెడ్ జోన్ అంటే ఏంటీ…?

-

కరోనా వైరస్ నేపధ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా రెడ్ జోన్ లను ప్రకటిస్తున్నారు. కరోనా కట్టడి లో భాగంగా ఈ రెడ్ జోన్స్ కీలకంగా మారాయి. అసలు రెడ్ జోన్ అంటే ఏంటీ…? అనేది చూద్దాం. పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అయిన ప్రాంతాలను రెడ్ జోన్ గా ప్రకటిస్తారు. ఇక్కడ కఠిన చర్యలను ఎక్కువగా అమలు చేస్తారు అధికారులు. ఏపీలో నెల్లూరు జిల్లాలో ఎక్కువగా 30 ప్రాంతాలు రెడ్‌జోన్‌ పరిధిలో చేర్చారు.

అసలు కేసులు లేని శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో ఒక్క రెడ్ జోన్ కూడా లేదు. పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాల నుంచి 3 కిలోమీటర్ల చుట్టూ ఉన్న ప్రాంతాలను ‘కంటెయిన్‌మెంట్‌ క్లస్టరు’గా గుర్తించి చర్యలు చేపడతారు. గుర్తిస్తారు. పట్టణాలు/నగర ప్రాంతాల్లో వైరస్‌ వ్యాప్తికి అవకాశం ఉన్న 5 కిలోమీటర్ల ప్రాంతాన్ని బఫర్‌ జోన్‌గా ప్రకటిస్తారు అధికారులు. ఇక్కడ ప్రత్యేక నిఘా ఉంటుంది.

గ్రామీణ ప్రాంతాల్లో ఇది 7 కిలోమీటర్ల వరకు ఉండగా… కరోనా లక్షణాలు ఏ మాత్రం కనపడినా సరే వారిని క్వారంటైన్‌లో ఉంచి పరీక్షిస్తారు. అత్యవసర వైద్య సేవలతోపాటు, ఇతర ముఖ్యమైన ప్రభుత్వ సేవలు మినహా కంటెయిన్‌మెంట్‌ జోన్‌ నుంచి ప్రజలు బయటకు వెళ్లకుండా నిఘా ఉంటుంది. లోపలకి వచ్చే వాళ్ళను బయటకు వెళ్ళే వాళ్ళను థర్మల్‌ స్క్రీనింగ్‌ చేస్తారు. ఏ ఒక్కటి లోపలి రావడానికి అనుమతి ఉండదు. ప్రజలకు నిత్యావసరాలు కూడా ప్రభుత్వమే అందిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version