సొంతింటి కల నెరవేర్చుకోవాలని అనుకుంటున్నారా..? అయితే ఇది కరెక్ట్ టైం. ఎందుకు అంటే అనేక బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు గత 15 ఏళ్లలో ఎప్పుడ లేనంతగా హోమ్లోన్లపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ, కోటక్ మహీంద్రా బ్యాంకులు వరుసగా వడ్డీ రేట్లని తగ్గించాయి.
ఎస్బీఐ లో రూ .75 లక్షల వరకు తీసుకునే హోమ్లోన్ల పై 6.7 శాతం, రూ 75 లక్షలకు పైబడి తీసుకునే రుణాల పై 6.75 శాతం మాత్రమే వడ్డీని వసూలు చేస్తుంది. ఇది ఇలా ఉంటే మహిళా రుణగ్రహీతలు 5 బిపిఎస్ అదనపు వడ్డీ రాయితీని కూడా ఇవ్వడం జరుగుతోంది.
కొత్తగా హోమ్ లోన్ తీసుకోవాలి అని అనుకునే వాళ్లు నెలవారీ ఈఎంఐ భారాన్ని తగ్గించుకునేందుకు తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే బ్యాంక్స్ ని ప్రిఫర్ చెయ్యండి. ఈ సమాచారం కోసం మీరు బ్యాంకుల అధికారిక వెబ్సైట్లను చూడాలి. వడ్డీ రేట్లు, ఛార్జీలు, ఇతర ఖర్చులని కూడా గమనించండి. మీ జీతం, నెలవారీ ఖర్చులను పరిగణలోకి తీసుకొని తక్కువ వ్యవధిని ఎంచుకోండి. అలానే ఎక్కువ డౌన్ పేమెంట్‌తో హోమ్ లోన్ తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వలన ఈఎంఐ భారం కూడా తగ్గుతుంది.
ఇదివరకే ఏదైనా బ్యాంకులో హోమ్‌లోన్ తీసుకున్నట్లైతే మీరు మీ వడ్డీ భారాన్ని ఇలా తగ్గించుకోవచ్చు. ప్రస్తుతం వడ్డీ రేట్లు తగ్గాయి కనుక మీ లోన్ అకౌంట్‌ను పాత బ్యాంకు నుంచి తక్కువ వడ్డీ అందించే బ్యాంకుకు బదిలీ చేసుకోండి. లేదంటే మీ లోన్‌లో కొంత భాగాన్ని ముందస్తుగా చెల్లించడం కనుక చేస్తే రుణ బ్యాలెన్స్‌ను తగ్గుతుంది.