గత టీడీపీ హయాంలో సీఎం చంద్రబాబును అత్యంత గాఢంగా నమ్మిన చాలా మంది అధికారులు తర్వాత కాలంలో అడ్రస్ గల్లంతు చేసుకున్నారు. ఇలాంటి వారిలో ప్రధానంగా వినిపించిన పేరు ఇంటిలిజెన్స్ మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు. ఆయన ఇప్పుడు తీవ్ర సంకట స్థితిలో చేరిపోయారు. గతంలో బాబును చూ సి అంతా తానే అనుకున్న ఏబీ.. పోలీసు రక్షణ పరికరాల కొనుగోలులో అవకతవకలకు పాల్పడ్డారు. దీంతో జగన్ ప్రబుత్వం ఆయనను సస్పెండ్ చేయడంతోపాటు.. నగరం విడిచి వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
అయితే, ఇది జరిగి రెండు మాసాలు అయినా కూడా ఇప్పటి వరకు ఏబీకి రిలీఫ్ రాలేదు. తాజాగా కూడా ఆయన కు ఉపశమనం లభించలేదు. ప్రవర్తనా నియమాల ఉల్లంఘనకు సంబంధించి సస్పెన్షన్‌కు గురైన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్‌లో చుక్కెదురైంది. తన సస్పెన్షన్‌ను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) మంగళవారం కొట్టేసింది. ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది.
ఇక ఇదే వ్యవహారంలో కేంద్ర హోంశాఖ కూడా ఏపీ ప్రభుత్వం నిర్ణయాన్ని సమర్థించిన విషయం తెలిసిందే. ప్రవర్తనా నియమాల్ని ఉల్లంఘించినందుకు ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ జగన్ ప్రభుత్వం ఫిబ్రవరి 8న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆల్ ఇండియా సర్వీసెస్ (క్రమశిక్షణ, అప్పీల్) నిబంధనల నియమం 3 (1) కింద సస్పెండ్ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఏబీ వెంకటేశ్వరరావు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా ఉండగా భద్రతా పరికరాల కొనుగోలు టెండర్లలో అవకతవకలకు పాల్పడినట్లు తేలటంతో సస్పెండ్ చేసినట్లు జీవో నంబర్ 18లో స్పష్టం చేసింది.
పోలీస్ ఇంటెలిజెన్స్ ప్రొటోకాల్స్ విధానాలను సైతం ఆయన ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినట్లు ప్రభుత్వం గుర్తించింది. అయితే, దీని వెనుక రాజకీయంగా బలమైన ప్రోద్బలం ఉండడంతోనే ఏబీ ఇలా వ్యవహరించారనేదివాస్తవం అంటున్నారు పోలీసులు ఉన్నతాధికారులు ఆఫ్‌ది రికార్డుగా..!