ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్‌ను మించి పారితోషికం తీసుకున్న స్టార్ ఆయనే..!

-

ప్రజెంట్ ఫిల్మ్ మేకింగ్ ఎంతటి భారీ వ్యయంతో కూడుకున్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి గ్రాండియర్ ఫిల్మ్స్ ను మేకర్స్ రూపొందిస్తున్నారు. ఇక నటీనటులకు భారీ రెమ్యునరేషన్స్ కూడా ఇస్తున్నారు. అయితే, అప్పట్లో ఇంతటి రెమ్యునరేషన్ కాని ప్రాజెక్టు కోసం డబ్బులు పెట్టే నిర్మాతలు అయితే లేరని చెప్పొచ్చు. ‘బాహుబలి’ వంటి చిత్రం తర్వాత నిర్మాతలు దర్శకులపై నమ్మకం పెట్టి వారి విజన్ కు తగ్గట్లు డబ్బులు పెట్టి సినిమాలు తీస్తున్నారు.

బాక్సాఫీసు వద్ద ఆ పిక్చర్స్ ఘన విజయం సాధిస్తున్నాయి. తద్వారా నిర్మాతలు లాభాలు పొందుతున్నారు. ఇక నటీ నటుల పారితోషికం విషయానికొస్తే… అప్పటికీ ఇప్పటికీ చాలా తేడాలున్నాయి. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లకు రెమ్యునరేషన్ కొంత ఎక్కువగా ఉండేది. మిగతా వాళ్లకు అంతంత మాత్రంగానే ఉండేవని సినీ పరిశీలకుల అంచనా. కాగా, ఆ రోజుల్లో వారిరువురిని మించిన పారితోషికం తీసుకున్న నటుడు ఉన్నారన్న సంగతి మీకు తెలుసా.. ఆయన ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

తెలుగు సినిమాకు రెండు కళ్లు అయిన ఎన్టీఆర్ సీనియర్, ఏఎన్ఆర్ లు ఇద్దరూ.. రూ.1 లక్ష రెమ్యునరేషన్ గా తీసుకునే వారు. అప్పట్లో అదే హయ్యెస్ట్ రెమ్యునరేషన్. వీరి పారితోషికం గురించి అప్పట్లో చర్చ జరిగేది. కాగా, వీరి కంటే ముందే ఓ నటుడు అంతటి పారితోషికం తసీుకున్నారు. ఆయనే చిత్తూరు నాగయ్య. చిత్తూరు జిల్లాలో జన్మించిన నాగయ్య..కు ఆ తర్వాత కాలంలో ‘చిత్తూరు నాగయ్య’ అనే పేరొచ్చింది.

ఆంధ్ర పత్రికలో పాత్రికేయుడిగా పని చేసిన నాగయ్య.. నటనపై ఉన్న ఆసక్తితో సినిమాలలోకి వచ్చారు. ‘గృహలక్ష్మి’ అనే పిక్చర్ ద్వారా నటుడిగా పరిచయమయ్యారు. తొలి చిత్రంతోనే చక్కటి గుర్తింపు పొందిన నాగయ్య.. ఆ తర్వాత కాలంలో ‘భక్త పోతన’, ‘వందేమాతరం’, ‘దేవత’ చిత్రాల్లో నటించి బాగా పాపులర్ అయ్యారు.

ప్రొడ్యూసర్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేసిన చిత్తూరు నాగయ్యకు పద్మ శ్రీ అవార్డు కూడా వచ్చింది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ సినిమాల్లోకి వచ్చే నాటికే చిత్తూరు నాగయ్య స్టార్ గా ఇండస్ట్రీలో కొనసాగారు. ఆయన అప్పట్లోనే ఒక్క సినిమాకు రూ.1 లక్ష రెమ్యునరేషన్ తీసుకున్నారట. అలా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లను మించిన పారితోషికం తీసుకున్నారాయన.

Read more RELATED
Recommended to you

Exit mobile version