శ్వేత విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్ గురించి ఈ విషయాలు తెలుసా?

-

శ్వేత విప్లవం అనే పేరు వినగానే అందరికి ముందుగా గుర్తుకు వచ్చే పేరు వర్గీస్ కురియన్..ఈయనను శ్వేత విప్లవ పితామహుడు అని పిలుస్తారు..పాల ఉత్పత్తిలో విప్లవం తీసుకొచ్చి,దేశం గర్వించేలా చేసిన మహనీయుడు ఈయన..అలాంటి మహొన్నతమైన వ్యక్తి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

పాల ఉత్పత్తిలో ప్రపంచ దేశాలలో అగ్ర స్థానంలో నిలిపారు వర్గీస్ కురియన్. ప్రపంచ వ్యాప్తంగా పాల ఉత్పత్తిలో అత్యధికంగా 23 శాతం పాలను భారత్ అందిస్తోంది. గ్రామీణంగా పాడి విషయంలో భారత్ జాగ్రత్తలు తీసుకుంటున్నా, ప్రపంచంలోనే అగ్ర స్థానంలో నిలవాలంటే ముందుచూపు ఉండాలి. వర్గీస్ కురియన్ చేసిన కృషికి నేడు దేశంలో పాల ఉత్పత్పి, సంబంధిత రంగాలలో నెంబర్ వన్గా నిలవడం నిదర్శనం. 6.2 శాతం వృద్ధితో 2020-21లో 209.96 మిలియన్ టన్నుల పాలు ఉత్పత్తి చేసింది భారత్. 2014-15  సమయంలో 146.31 మిలియన్ టన్నుల పాలను అందించిన ఘనత భారత్ కు ఉంది.

ఈయన భారత దేశంలోని కేరళలోని కోజికోడ్లో 26 నవంబర్ 1921న జన్మించారు. తండ్రి సివిల్ సర్జిన్. గోబిచెట్టిపలాయంలోని డైమండ్ జూబ్లీ హయ్యర్ సెకండరీ స్కూల్లో విద్యాభ్యాసం ముగిసింది. 14 ఏళ్లలో చెన్నైలోని లయోలా కాలేజీలో చేరారు. ఆ తరువాత గిండీలోని ఇంజినీరింగ్ కళాశాల నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ప్రభుత్వ స్కాలర్ షిప్ రావడంతో మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీకి వెళ్లారు. అక్కడ మాస్టర్స్ పూర్తి చేసుకున్నారు. కానీ ఆయన తల్లి మాత్రం వర్గీస్ కురియన్ను జంషెడ్పూర్లోని టాటా స్టీల్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగం చేయాలని కోరింది. సమీప బంధువుతో రికమండేష్ చేయించినా, వర్గీస్ కుమరియన్ అమెరికా వెళ్లి మాస్టర్స్ చేశారు..

అక్కడ మాస్టర్స్ పూర్తి చేసుకోని 1949లో భారత్ కు తిరిగొచ్చాక కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఛాన్స్ ఇచ్చింది. గుజరాత్ ఆనంద్లోని ఓ పాల కేంద్రంలో నియమితులైన వర్గీస్ కురియన్ డెయిరీ విభాగంలో 5 ఏళ్లపాటు అక్కడ సేవలు అందించారు. ఈ క్రమంలో త్రిభువందాస్ పటేల్ను కలిశారు. దోపికీడికి వ్యతిరేకంగా, రైతులను ఏకం చేసే సహకార ఉద్యమాన్ని నడిపిస్తున్న పటేల్తో కలిసి పనిచేయాలని వర్గీస్ కుమరియన్ భావించారు. ఈ క్రమంలోనే అమూల్ సహకార సంస్థ ఏర్పాటు కాగా, వర్గీస్ కురియన్ స్నేహితుడు హెచ్ఎం దాలయ గేదె పాల నుంచి పాల పొడి, ఘనీకృత పాలను తయారు చేసే విధానాన్ని కనుగొన్నారు. డెయిరీ నిపుణుడు దాలయ కనిపెట్టిన విధానంతో అమూల్ డెయిరీ టెక్నిక్స్ గుజరాత్ తో పాటు ఇతర రాష్ట్రాల లో కూడా వేగంగా వ్యాపించాయి.

1965లో అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి సమయంలో జాతీయ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ ఏర్పాటు చేశారు. 1998 వరకు వర్గీస్ కుమరియన్ ఎన్డీడీబీకి వ్యవస్థాపక ఛైర్మన్గా కొనసాగారు. ఈ సమయంలోనే 1970లో రైతుల సహకారంతో శ్వేత విప్లవం ( ఆపరేషన్ ఫ్లడ్)ను ప్రారంభించారు. దాదాపు పదేళ్ల తరువాత ఆనంద్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ను స్థాపించి పాల ఉత్పత్తికి విశేషంగా కృషిచేశారు. 1970 నుంచి 1980 వరకు పాల ఉత్పత్తి అధికంగా చేసే ప్రాంతాలను మెట్రో నగరాలతో అనుసంధానం చేసి పాల సరఫరాను వేగవంతం చేశారు. రెండో దశలో 1981 నుంచి 1985 వరకు దేశంలో ప్రధాన పాల ఉత్పత్తి కేంద్రాలు పది నుంచి ఒకేసారి 140కి పెరిగాయి.

ఇక మూడో దశలో 1986 నుంచి 1996 వరకు పాల సహకార సంస్థలు గ్రామాలకు సైతం చేరాయి. దేశంలో వందల సంఖ్యలో ఉన్న డెయిరీ సంహకార సంస్థలను వర్గీస్ కురియన్ తోడ్పాడుతో డెబ్భై వేలకు పెంచారు. గ్రామాల్లో ఎంతో మందికి పాడి, పశుపోషణ, పాల ఉత్పత్తి జీవనాధారంగా, వ్యాపారంగా దోహదం చేసింది. ఈ క్రమంలో పాల ఉత్పత్తిలో దేశం ప్రపంచ దేశాలలో అగ్రస్థానానికి చేరుకుంది. అలా ఆయనను శ్వేత విప్లవ పితామహుడిగా పేరు గాంచారు. 90 ఏళ్ల వయసులో 9 సెప్టెంబర్ 2012న గుజరాత్ లోని నడియాడ్లో కన్ను మూసారు..
ఈయన దేశానికి చేసిన సేవలను గుర్తించిన ప్రభుత్వం ఎన్నో అవార్డులను కూడా అందించింది..అవేంటో చూడండి..

పాల ఉత్పత్తి కోసం ఎంతగానో సేవ చేసిన వర్గీస్ కురియన్కు కేంద్ర ప్రభుత్వం పలు అవార్డులతో సత్కరించింది.
1963లో రామన్ మెగాసెసె అవార్డు
1965లో పద్మశ్రీ
1966లో పద్మభూషణ్
1986లో కృషి రత్న
1986లో వాట్లర్ శాంతి బహుమతి
1989లో వరల్డ్ ఫుడ్ ప్రైజ్
1993లో ఇంటర్నేషనల్ పర్సన్ ఆఫ్ ద ఇయర్
1997లో ఆర్డర్ ఆఫ్ అగ్రికల్చరల్ మెరిట్
1999లో పద్మ విభూషణ్ అవార్డుతో కేంద్రం ఆయనను సత్కరించింది..ఈయన పేరు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది..స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆయన చేసిన సేవలను స్మరించుకుందాము..

 

Read more RELATED
Recommended to you

Exit mobile version