అక్కినేని అఖిల్ నాల్గవ చిత్రం సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేస్తున్నారు. లాంగ్ గ్యాప్ తర్వాత అఖిల్ చేస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన ప్రేమకథా చిత్రం ఇది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి వుంది. అయితే ఈ సినిమాకి ఇంతవరకూ టైటిల్ ను ఖరారు చేయలేదు. రేపు సాయంత్రం 5 గంటల 5 నిమిషాలకు టైటిల్ ను రివీల్ చేయనున్నారు.
‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారనీ, దాదాపు ఇదే టైటిల్ ఖరారు చేయవచ్చనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఈ సినిమాకి గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఆయన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ కానుందని అంటున్నారు. ఈ సినిమాతో తనకి తప్పకుండా హిట్ పడుతుందనే నమ్మకంతో అఖిల్ వున్నాడు. ఆయన అభిమానులు కూడా అదే అభిప్రాయంతో వున్నారు.