ఢిల్లీ ఎన్నికల నేపధ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్… బిజెపి అధిష్టానానికి చుక్కలు చూపిస్తున్నారు. ప్రధానంగా నరేంద్ర మోడీ, అమిత్ షా సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నారు. ప్రచారంలో బిజెపి ఊహించని విధంగా ఆయన ముందుకి వెళ్తున్నారు. తాజాగా వెల్లడించిన ఒక సర్వేలో ఆప్ దూసుకుపోతున్నట్టు వెల్లడైంది. బిజెపి జాతీయ భావం, దేశ భక్తి గురించి మాట్లాడుతూ ప్రచారం చేస్తుంది.
దీన్ని అరవింద్ కేజ్రివాల్ సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నారు. తాను ఏం చేసాను, ఈ అయిదేళ్ళలో ఎం జరిగింది అనే విషయాలను మాత్రమె ఆయన ప్రస్తావిస్తున్నారు. ఈ అయిదేళ్ళలో తాను చేసిన అభివృద్ధి సహా తనను అధికారం నుంచి దింపడానికి బిజెపి చేస్తున్న ప్రయత్నాలను ఆయన ప్రస్తావించి ఇరుకున పెడుతున్నారు. అదే విధంగా తాను నియమించుకున్న ప్రశాంత్ కిషోర్ సలహాలను కూడా సమర్ధవంతంగా ఆయన వినియోగిస్తున్నారు.
హైదరాబాద్‌కు చెందిన పీపుల్స్ పల్స్ సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సర్కారు సంక్షేమ పథకాల పట్ల ఢిల్లీలో పేదలు, మధ్య తరగతి ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. సంక్షేమ పథకాల వల్ల ప్రతి కుటుంబం నెలకు రూ.1500-3000 ఆదా చేస్తున్నట్టు సర్వే వెల్లడించింది. ఈ ఎన్నికల్లో మోదీ ఆకర్షణ, అమిత్ షా వ్యూహాలు పనిచేయవని స్పష్టం చేసింది.
ఆయనకు దీటుగా బిజెపి అడుగులు వేయడం చాలా కష్టమని, అక్కడ సమర్ధ నాయకత్వం లేకపోవడం, కాంగ్రెస్ లోపాలు కూడా ఆప్ కి కలిసి వస్తాయని, బీజేపీ ప్రచారం సోషల్ మీడియాకు మాత్రమే పరిమితం అయిందని సర్వే చెప్పింది. స్థానిక బిజెపి నాయకత్వం ఆప్ ని ఎదుర్కోలేక ఇబ్బందులు పడుతుందని అంటున్నారు. మోడీ ఆకర్షణ అసలు ఢిల్లీలో లేదని… గంభీర్ ఆకర్షణ అసలు లేదని పరిశీలకులు కూడా అంటున్నారు.