ఇన్వెస్ట్ చెయ్యాలనుకుంటున్నారా…? అయితే ఇలా చెయ్యండి…!

-

2021లో ఎక్కువ రాబడిని పొందాలనుకుంటున్నారా…? అయితే ఈ పద్దతిని అనుసరించాలి. అయితే అన్నింటి లో కంటే రియల్ ఎస్టేట్, బంగారం, స్టాక్ మార్కెట్‌ లో డబ్బులు పెడితే మంచి రాబడి పొందొచ్చు. ఇప్పటికే 2020 లో కరోనా వైరస్ ప్రపంచమంతటా వ్యాపించింది. ఆర్థిక వ్యవస్థలు అన్నీ కరోనా వైరస్ కోరల్లో చిక్కి సతమతమయ్యాయి. ఇప్పుడిప్పుడే పరిస్థితి మెరుగు పడుతోంది. అయితే ఇన్వెస్ట్ చేయాలని భావించే వారికి 2021 మంచి ఏడాది అని చెప్పుకోవచ్చు.

money
money

స్టాక్ బ్రోకింగ్ సంస్థ జీసీఎల్ సెక్యూరిటీస్ ప్రకారం పలు ప్రభుత్వ స్కీమ్స్ వల్ల మార్కెట్ ‌లో లిక్విడిటీ ప్రారంభమైంది. జీసీఎల్ సెక్యూరిటీస్ వైస్ చైర్మన్ రవి సింఘాల్ ఏం అన్నారంటే… కోవిడ్ 19 నేపథ్యం లో వర్క్ ఫ్రం హోమ్ వల్ల కంపెనీల ఖర్చులు తగ్గుతాయని అలానే వాటా ఆదాయం కూడా పెరగొచ్చని అందువల్ల మంచి ఆర్థిక ఫలితాలు ప్రకటించే అవకాశముందని చెప్పారు. అంతే కాకుండా 2021 లో ఈక్విటీ, గోల్డ్, ప్రాపర్టీల లో డబ్బులు పెడితే మంచి రాబడి పొందొచ్చని చెప్పడం జరిగింది. ఐటీ కంపెనీల స్టాక్స్‌ లో డబ్బులు పెట్టడం వల్ల మంచి రాబడి వస్తుంది. కనుక ఐటీ షేర్లు కొనొచ్చని కూడా తెలిపారు.

ఇది ఇలా ఉంటె బంగారం లో కూడా ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చని సిఫార్సు చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా బంగారం లో డబ్బులు పెట్టొచ్చు. రియల్ ఎస్టేట్ ‌లో డబ్బులు పెట్టినా కూడా మంచి రాబడి పొందొచ్చు. దీర్ఘకాలం లక్ష్యం తో టైర్ 2, టైర్ 3 ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్‌ లో డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు. కాబట్టి ఈ విధంగా అనుసరిస్తే మాత్రం ఖచ్చితంగా మంచి రాబడి పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news