ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో 12 మంది పౌరులు మృతి

-

ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా రష్యన్ సేనలు తూర్పు ఉక్రెయిన్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో రష్యన్‌ సేనలు జరిపిన భయంకర దాడుల్లో 11 మంది పౌరులు దుర్మరణం చెందారు. దినిప్రో నగరంలో పుతిన్‌ బలగాల దాడుల్లో 9 అంతస్తుల భవనం ధ్వంసమైంది. ఈ ఘటనలో అక్కడ ఒకరు ప్రాణాలు కోల్పోయారు. డోనెట్స్క్‌లోని నియుయార్క్‌పై జరిగిన షెల్లింగ్‌లో ఐదుగురు గాయపడ్డారు. గత 24 గంటల్లో రష్యా బలగాలు 13 సార్లు జనావాస ప్రాంతాలపై షెల్లింగ్‌ చేశాయి. విల్నియాన్స్క్ పట్టణంపై జరిపిన వైమానిక దాడుల్లో ఏడుగురు మృతి చెందారు.

రాత్రికి రాత్రే 10 రష్యా డ్రోన్‌లను కూల్చివేసినట్లు కీవ్‌ ఎయిర్‌ఫోర్స్‌ వెల్లడించింది. వెయి కిలోమీటర్ల ఉక్రెయిన్‌ ఫ్రంట్‌లైన్‌లో  విరుచుకుపడుతున్న రష్యా సేనలు.. అనేక మౌళిక సదుపాయాలను, ఇంధన, విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలను దెబ్బతీస్తున్నాయని ఉక్రెయిన్ వాపోయింది. అటు.. రష్యాలోని కుర్స్క్ నగరంలో ఉక్రెయిన్‌డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడిలో ఐదుగురు పౌరులు మరణించారని క్రెమ్లిన్‌ వెల్లడించింది. 6 ఉక్రేనియన్ డ్రోన్‌లను దేశంలోని ట్వెర్, బ్రయాన్స్క్, బెల్గోరోడ్‌, క్రిమియాలలో కూల్చివేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news