ఎస్‌బీఐ ఛైర్మన్‌గా తెలుగు వ్యక్తి చల్లా శ్రీనివాసులు శెట్టి!

-

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తదుపరి ఛైర్మన్‌ పదవికి చల్లా శ్రీనివాసులు (సీఎస్‌) శెట్టి పేరును ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ బ్యూరో (ఎఫ్‌ఎస్‌ఐబీ) సిఫారసు చేసింది. ప్రస్తుతం ఆయన ఇదే బ్యాంక్‌లో మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉండి.. అంతర్జాతీయ బ్యాంకింగ్, గ్లోబల్‌ మార్కెట్స్, టెక్నాలజీ విభాగాల బాధ్యతలను చూసుకుంటున్నారు. 2024 ఆగస్టు 28న ప్రస్తుత ఛైర్మన్‌ దినేశ్‌ కుమార్‌ ఖారా(63) పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆ స్థానంలోకి సరైన వ్యక్తిని ఎంపిక చేసే బాధ్యతను ఎఫ్‌ఎస్‌ఐబీ తీసుకుంది.

ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల డైరెక్టర్లను ఎంపిక చేసే ఎఫ్‌ఎస్‌ఐబీ శనివారం ముగ్గురిని ఇంటర్వ్యూ చేసి సీఎస్‌ శెట్టి పేరును ఛైర్మన్‌ పదవికి సిఫారసు చేసింది. అయితే తాను ఒక యాక్సిడెంటల్‌ బ్యాంకర్‌నని చల్లా శ్రీనివాసులు అంటున్నారు. అందరూ బ్యాంకు పరీక్షలు రాస్తున్నారు కాబట్టి, తానూ రాశానని.. అలా 1988లో ఎస్‌బీఐలో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా తన ప్రస్థానం ప్రారంభమైందని ఆయన చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news