BREAKING : దుండగుల కాల్పుల్లో 26 మంది మృతి.. ఎక్కడంటే?

-

ఆఫ్రికా దేశం మాలిలో దుండగుల కాల్పుల్లో 26 మంది ప్రాణాలు బలయ్యాయి. బుర్కినాఫసోతో ఉన్న దేశ సరిహద్దుల్లో సోమవారం ఈ ఘటన జరిగింది. డెంబో అనే గ్రామంలో పొలాల్లో పనిచేసుకుంటుండగా.. దుండగులు ఒక్కసారిగా కాల్పులతో దాడికి పాల్పడినట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఈ దాడికి ఏ వర్గమూ బాధ్యత వహించలేదని చెప్పారు. ఈ ప్రాంతంలో ఇటీవల ఈ తరహా దాడులు మరీ ఎక్కువయ్యాయని వెల్లడించారు.

తమ దేశం సైన్యం సైతం వీటిని నిలువరించలేకపోతోందని అధికార వర్గాలు తెలిపాయి. సాధారణంగా ఇక్కడి గ్రామీణ ప్రజలపై ఉగ్రసంస్థ అల్‌ ఖైదాకు అనుబంధంగా పనిచేసే జేఎన్‌ఐఎం గ్రూప్‌ దాడులు చేస్తుంటుందని.. ఈ నెలలోనే ఓ వివాహ వేడుకలో 21 మంది సామాన్యులను పొట్టనబెట్టుకుందని చెప్పాయి. తాజా దాడి కూడా వారి పనే అయ్యుంటుందని అనుమానిస్తున్నాయి. ఉత్తర ప్రాంతంలోని నగరాల్లో ఒకప్పుడు అధికారంలో ఉన్న తీవ్రవాద ముఠాలను ఫ్రెంచి సైన్యం సాయంతో దేశ భద్రతా బలగాలు తరిమికొట్టడంతో వారంతా గ్రూపుగా ఏర్పడి గ్రామాలు, సైనికులపై దాడులకు తెగబడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news