ప్రపంచంలో అత్యధికంగా ట్రాఫిక్‌ రద్దీ ఉండే నగరాల్లో 3 భారత్‌లోవే

-

ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండి ట్రాఫిక్‌ నెమ్మదిగా కదిలే మొదటి పది నగరాల్లో మూడు భారత్​కు చెందిన నగరాలే ఉన్నాయి. మొదటి స్థానంలో బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా నిలిచింది. ఈ జాబితాలో భారత్​లోని భివంఢీ (5వ స్థానం), కోల్‌కతా (6వ స్థానం), ఆరా (7వ స్థానం) నగరాలు ఉన్నాయి. ఈ నగరాల్లో ట్రాఫిక్ అతి నెమ్మదిగా కదులుతూ ఉంటుందని అమెరికాలోని ఎన్‌జీవో జాతీయ ఆర్థిక పరిశోధన బ్యూరో అధ్యయనంలో తేలింది.

మొత్తం 152 దేశాల్లోని 1200 నగరాల్లో ట్రాఫిక్‌ను పరిశీలించి.. రోజు మొత్తంలో ట్రాఫిక్‌ను అధ్యయనం చేసింది. ఇందులో ప్రపంచంలోనే అతి నెమ్మదిగా ట్రాఫిక్‌ కదిలే నగరాల్లో మూడు భారత్​లోవేనని తేలగా.. ఢాకా అత్యంత నెమ్మదిగా ట్రాఫిక్‌ కదిలే నగరంగా ఉంది. మరోవైపు అత్యంత వేగంగా ట్రాఫిక్‌ కదిలే నగరాల్లో అమెరికాలోని ఫ్లింట్‌ తొలి స్థానంలో నిలిచింది.

అత్యంత ఇరుకైన నగరంగా కొలంబియాలోని బొగొటా నెలవగా.. నెమ్మదిగా వాహనాలు కదిలే నగరాల్లో బిహారీ షరీఫ్‌ 11వ స్థానంలో, ముంబయి 13వ స్థానంలో, ఐజ్వాల్‌ 18వ స్థానంలో, బెంగళూరు 19వ స్థానంలో, షిల్లాంగ్‌ 20వ స్థానంలో నిలిచాయి. ఇరుకుగా ఉండే నగరాల్లో బెంగళూరు 8వ స్థానంలో, ముంబయి 13వ స్థానంలో, దిల్లీ 20వ స్థానంలో నిలిచాయి.

Read more RELATED
Recommended to you

Latest news