తెలంగాణ దళితులకు గుడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు రెండో విడత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుందని ప్రభుత్వం తెలిపింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 15 జిల్లాల పరిధిలో 45 నియోజకవర్గాల్లో నిర్నిత సంఖ్యలో లబ్ధిదారుల జాబితాలో సిద్ధమయ్యాయని పేర్కొంది.
రెండో విడతలో హుజురాబాద్ మినహా మిగిలిన 118 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 1100 కుటుంబాల చొప్పున ఈ పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఇది ఇలా ఉండగా, ప్రభుత్వ స్కూళ్లలో దసరా నాటికి ప్రారంభించాల్సిన సీఎం అల్పాహార పథకాన్ని ఈనెల 6ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబర్ 13 నుంచి దసరా సెలవులు ఉండటంతో 6 నుంచి జిల్లాకు ఒక స్కూలులో పథకం అమలు చేసి పరిశీలించనుంది. అక్టోబర్ 26న స్కూల్లు పునః ప్రారంభం కానుండగా… లోపాలను సరిచేసి అన్ని పాఠశాలలకు విస్తరించాలని భావిస్తుంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నుంచి ఈ పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.