రఫాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం.. 35 మంది దుర్మరణం

-

ఇజ్రాయెల్‌ రాజధాని టెల్‌ అవీవ్‌పై హమాస్‌ చేసిన దాడికి ప్రతీకారంగా ఆ దేశ సైన్యం గాజా నగరంపై బాంబుల వర్షం కురిపించింది. దక్షిణ గాజాలోని రఫా నగరంపై వైమానిక దాడులతో విరుచుకు పడింది. ఇజ్రాయెల్‌ సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో దాదాపు 35 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు గాజా వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

నివాసితులు ఉంటున్న గుడారాలపై వరుస బాంబు దాడులు జరిగాయని తెలిపింది. ఈ దాడుల్లో పలువురు గాయపడినట్లు పేర్కొంది. దాడి జరిగిన ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ప్రజలు ఉండడం వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యాధికారులు తెలిపారు. మరోవైపు ఈ దాడిని ఇజ్రాయెల్‌ ఖండించింది. ఆ ప్రాంతంలో ఏం జరుగుతుందో తమకు తెలియదని ఇజ్రాయెల్‌ సైన్యం పేర్కొంది.

అంతకుముందు టెలీ అవీవ్‌పై హమాస్‌రాకెట్లతో విరుచుకుపడింది. తమ పౌరులపై జరుగుతోన్న మారణకాండకు ప్రతీకారంగా ఈ దాడులు చేసినట్లు తెలిపింది. గాజా స్ట్రిప్ నుంచి రాకెట్ దాడులు జరిపినట్లు హమాస్ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news