తీరం దాటిన రెమాల్‌ తుపాను.. ఒడిశా, బంగాల్‌లో భారీ వర్షాలు

-

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘రెమాల్‌’ తుపాను తీవ్ర తుపానుగా బలపడింది. ఇది ఉత్తర దిశగా పయనించి ఆదివారం అర్ధరాత్రి దాటాక బంగ్లాదేశ్, పశ్చిమబెంగాల్‌ సరిహద్దుల్లో తీరం దాటింది. తీరం దాటే సమయంలో గరిష్ఠంగా 135 కి.మీ. వేగంతో గాలులు వీచాయని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల నుంచి ఇప్పటికే బెంగాల్‌ ప్రభుత్వం 1.10 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. సహాయక చర్యల కోసం 16 బెటాలియన్ల రాష్ట్ర, జాతీయ విపత్తు నిర్వహణ దళాలను అధికారులు సిద్ధం చేశారు.

మరోవైపు తుపాను ప్రభావంతో ఏపీలోని కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలంలోని తీరప్రాంతాల్లో కెరటాలు ఉవ్వెత్తున ఎగసి పడ్డాయి. ఉప్పాడ, మాయాపట్నం, సూరాడపేట, కోనపాపపేట తదితర చోట్ల సముద్రం ముందుకు ముంచుకొచ్చింది. దీంతో ఉప్పాడ – కాకినాడ బీచ్‌రోడ్డుపై రాకపోకలు నిలిపేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. ‘రెమాల్‌’ ప్రభావంతో పశ్చిమబెంగాల్, ఒడిశా, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ నెల 28 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news