మొదటి ఓటు వేసిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి*

-

 

మాజీ మంత్రి జగదీష్ రెడ్డి.. మొదటి ఓటు వేశారు. వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్లో భాగంగా సూర్యాపేట జూనియర్ కళాశాలలోని 457వ బూత్ లో మొట్ట మొదటగా ఓటు వేసి.. ఓటు హక్కును వినియోగించుకున్నారు మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి.

Former Minister Jagdish Reddy who voted first

బూత్ లో మొత్తం 673 ఓటర్లు ఉండగా పోలింగ్ ప్రారంభ సమయానికి వచ్చి మొట్టమొదటగా ఓటు వేశారు జగదీష్ రెడ్డి. కాగా, వరంగల్, నల్గొండ, ఖమ్మం శాసనమండలి పట్టభద్రుల ఉపఎన్నిక పోలింగ్ మొదలైంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు ఓటింగ్ జరగనుంది. శాసనసభ ఎన్నికల్లో జనగామ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఖాళీ అయిన స్థానానికి ఉపఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. మధ్యాహ్నం ఎండ దంచికొడుతుండటంతో ఉదయాన్నే ఓటు హక్కు వినియోగించుకునేందుకు గ్రాడ్యుయేట్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news