సెంట్రల్ థాయ్ లాండ్ లోని సుపాన్ బూరిరి ప్రావిన్స్ లో ఓ బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో బుధవారం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 18 మంది కార్మికులు మరణించినట్టు రెస్క్యూ పనులు చేపడుతున్న సిబ్బంది తెలిపారు.
ఈ పేలుడు ధాటికి ఫ్యాక్టరీలో పని చేస్తున్న వారిలో ఎవ్వరూ ప్రాణాలతో మిగల్లేదని తెలుస్తోంది. పేలుడు కారణం ఏంటన్న వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలికి చేరుకున్న డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ సహాయక చర్యలు చేపడుతోంది.