అమెరికాలో వనపర్తికి చెందిన విద్యార్థి మృతి

-

వనపర్తి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఉన్నత విద్య కోసం అమెరికా  వెళ్లిన వెద్యార్థి అకస్మాత్తుగా మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. వనపర్తి పట్టణం 26వ వార్డుకు చెందిన గట్టు వెంకన్న కుమారుడు గట్టు దినేష్ ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లారు. హైదరాబాద్‌లో బీటెక్ పూర్తి చేసి ఎమ్మెస్ కోసం అమెరికా వెళ్లగా అక్కడ ఇంట్లో నిద్రిస్తున్న వారు నిద్రలోనే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

అక్కడి నుంచి భౌతికకాయాన్ని తరలించేందుకు వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దినేష్ తో పాటు ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన మరో విద్యార్థి కూడా అద్దెకుంటున్న ఇంట్లో మృతి చెందినట్లు చెప్పారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పలువురు రాజకీయ ప్రముఖులు గట్టు వెంకన్నను పరామర్శించి ఓదార్చారు.

 

Read more RELATED
Recommended to you

Latest news